తాజాగా మాంచి రసవత్తర పరిస్థితుల్లో తెలుగు చలన చిత్ర పరిశ్రమ వద్ద ‘మా’ సంగతి తెలిసిందే. అలాగే ఈ ఎన్నికల అనంతరం ఊహించని విధంగా మంచు వారబ్బాయి మంచు విష్ణు విజయ కేతనం ఎగురవేయడంతో సరికొత్త అలజడి కూడా మొదలు అయ్యింది. అయితే మొదటి నుంచి కూడా మంచు విష్ణు గెలుపులో వెనుక ఎవరో ఉన్నారని టాక్ ఉంది.
అయితే నిన్ననే మా కొత్త ప్రెసిడెంట్ గా మంచు విష్ణు భాద్యతలు చేపట్టగా దానికి కొద్ది గంటల్లోనే ఏపీ ప్రభుత్వం ఏపీలో 100 శాతం సీటింగ్ ఇవ్వడంతో పాటుగా నాలుగు షోలు వేసుకునేందుకు కూడా అనుమతులు ఇవ్వడం జరిగింది. దీనితో ఇక్కడ విష్ణు భాద్యతలు చేపట్టడం..
అక్కడ ప్రభుత్వం నుంచి అనుమతులు రావడం ఒక ప్రాసెస్ లో జరిగినట్టు అనిపిస్తుంది అని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దీనితో ఇదంతా మంచు విష్ణు మహాత్యమే అని చెప్పాలి. ఇక దీనితో పాటుగా ఏపీలో ప్రధానంగా ఉన్న టికెట్ రేట్ సమస్యని కూడా విష్ణు తీర్చినట్టు అయితే అది ఇంకా హ్యాపీ..