ఇంత జరిగిన బాబులో మార్పు రాలేదా..? సీఎం జగన్ పీకింది ఏమిటో మర్చిపోయావా.. ?

cbn and cm jagan

 40 ఏళ్ల రాజకీయానుభవం అందులో 14 ఏళ్ల ముఖ్యమంత్రిగా, 12 ఏళ్ళు ప్రతిపక్ష నేతగా చేసిన వ్యక్తి నిండు అసెంబ్లీ లో స్పీకర్ వెల్ లోకి దూసుకొనివచ్చి ఏమి పీకుతారో పీక్కోండి అంటూ మాట్లాడటం ఎంత వరకు సబబు అనే విషయాన్నీ పక్కన పెడితే, రాజ్యాంగ పరంగా అధికారంలోకి వచ్చిన సీఎంను పట్టుకొని మీరు ఫేక్ సీఎం అంటూ విమర్శలు చేయటం భావ్యమా..? ఇప్పుడు జగన్ ఫేక్ సీఎం అయితే 14 ఏళ్ళు సీఎం గా చేసిన మీరుకూడా ఫేక్ సీఎం అనేగా..!

cbn and cm jagan

ఈ ముఖ్య‌మంత్రి (వైఎస్ జ‌గ‌న్‌)కి క‌నీసం ఇంగిత జ్ఞానం ఉందా…లేక సైకోనా? అనే అనుమానం వ‌స్తోంది. జ‌గ‌న్ ఫేక్ సీఎం. త‌ప్పుడు మ‌నుషులు. త‌ప్పుడు ప్ర‌భుత్వం. గాలి మాట‌లు, సొల్లు క‌బుర్లు. అంటూ మీడియా సమావేశంలో దేశంలోనే సీనియర్ పొలిటిషన్ గా చెప్పుకునే చంద్రబాబు నాయుడు అన్న మాటలు. ఏమి పీక్కుంటారో పీక్కోండని బాబు మాట్లాడే ముందు ఒక సరి వెనక్కి తిరిగిచూసుకుంటే జగన్ ఏమి పీకాడో బాగానే అర్ధం అవుతుంది.

అది సరిపోలేదా బాబు గారు

అధికారం నా జన్మ హక్కు అన్నట్లు వ్యవహరిస్తున్న చంద్రబాబుకు 2014 లో ఓటమి భయాన్ని రుచి చూపించి వదిలిపెట్టిన జగన్, 2019 నాటికీ అసలైన ఓటమి అంటే ఎలా ఉంటుందో తెలియచేశాడు , 175 స్థానాల్లో 151 సీట్లు సాధించి దేశంలో మారే పార్టీ సాధించలేని మెజారిటీ సాధించి చంద్రబాబును అధికారపీఠానికి దూరం చేశాడు. జగన్ చిటికేస్తే నిమిషాల వ్యవధిలో చంద్రబాబుకు అసెంబ్లీ లో ప్రతిపక్ష హోదా లేకుండా పోతుంది, కానీ ప్రతిపక్షము అంటే గౌరవం ఉండటం వలన జగన్ ఆ పనిచేయకుండా ఆగిపోయాడు. ఒక రకంగా చంద్రబాబు అనుభవిస్తున్న ప్రతిపక్ష నేత హోదా సీఎం జగన్ భిక్ష అనే చెప్పాలి ఇంత కంటే ఇంకేమి కావాలో (పీకించుకోవాలో ) చంద్రబాబు తేల్చుకోవాలి.

ఇక అసెంబ్లీ లోప‌ల‌, బ‌య‌ట చంద్ర‌బాబు మాట‌లు వింటే… ఇంత‌కూ రాజ‌కీయ చ‌ర‌మాంకంలో చంద్ర‌బాబుకు ఏమైంద‌నే అనుమానం ఎవ‌రికైనా రాక మాన‌దు. ఎదుటి వాళ్ల స‌భ్య‌త , సంస్కారం గురించి నీతులు వ‌ల్లించే చంద్ర‌బాబు …తాను పాటిస్తున్న విలువ‌లేంటో ఒక్క‌సారి అంత‌రాత్మ‌ను ప్ర‌శ్నించుకోవాలి. సభలో హుందాగా నడుచుకుంటూ, మిగిలిన సభ్యులకు సభ మర్యాదలు నేర్పించాలని అనుభవశాలి చంద్రబాబు నాయుడే ఇలా గౌరవ మర్యాదలు మరచి ఏకంగా స్పీకర్ వెల్ లో ధర్నాలు చేయటం, గౌరవ సీఎంను అమర్యాదగా మాట్లాడటం ముమ్మాటికీ తప్పే.