Home Andhra Pradesh తిరుపతి టికెట్ జనసేన కోరడం వెనుక పెద్ద వ్యూహ్యం!?

తిరుపతి టికెట్ జనసేన కోరడం వెనుక పెద్ద వ్యూహ్యం!?

 తిరుపతి ఉప ఎన్నికల్లో పోటీచేయాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నాడు, ఇందులో భాగంగా ఢీల్లి స్థాయిలో మంతనాలు సాగిస్తున్నాడు. 2019 లో పోటీచేసి ఘోరమైన ఓటమిని చవిచూసిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు తిరుపతి ఉప ఎన్నికల్లో బలమైన వైసీపీని, కార్యకర్తల బలం కలిగిన టీడీపీని ఎదుర్కోవటానికి సిద్ధం కావటం వెనుక భారీ వ్యూహం ఉన్నట్లు తెలుస్తుంది.

Pawan Kalyan Janasena

తెలంగాణలో త్యాగం అందుకేనా

పవన్ కళ్యాణ్ తాజాగా తీసుకున్న కొన్ని నిర్ణయాలు గమనిస్తే తిరుపతి ఉప ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలుస్తుంది. గ్రేటర్ ఎన్నికల్లో పోటీచేసిన కనీసం ఒక్క డివిజన్ లో కూడా విజయం సాధించలేమని తెలిసిన కానీ, 50 డివిజన్స్ లో కమిటీలను ఏర్పాటు చేసి ఎన్నికల్లో పోటీచేయబోతున్నాం అంటూ హల్చల్ చేశాడు , మరికాసేపటిలో అభ్యర్థుల లిస్ట్ ప్రకటించబోతున్నారు అనుకున్న సమయంలో పొత్తు గురించి బీజేపీ తో చర్చలు అంటూ ఒక ట్విస్ట్ ఇచ్చాడు, ఆ తర్వాత పోటీ నుండి తప్పుకుంటున్నట్లు ఒక ప్రకటన విడుదల చేసి, బీజేపీ కి మద్దతు ఇచ్చాడు. అయితే ఇక్కడ గమనిస్తే పవన్ కళ్యాణ్ ఆలోచన సృష్టంగా తెలుస్తుంది. తెలంగాణలో బీజేపీ కోసం తాము త్యాగం చేశామనే అభిప్రాయాన్ని కలిగించటమే ఆయన లక్ష్యం. దీనిని చూపించి ఆంధ్రాలో తిరుపతి స్థానం తమకు కావాలని డిమాండ్ చేయవచ్చనే వ్యూహంతోనే గ్రేటర్ లో పోటీ అంటూ హల్చల్ చేశాడు.

తిరుపతిలోనే ఎందుకు..?

2014 ఎన్నికల్లో పోటీచేయకుండా బీజేపీకి టీడీపీకి మద్దతు ఇచ్చాడు, 2019 ఎన్నికల్లో పోటీచేసిన ఘోరంగా ఓడిపోయాడు. అలాంటిది తిరుపతి పార్లమెంట్ లో పోటీచేసి ఎలా గెలవగలను అనే దైర్యం పవన్ కళ్యాణ్ కు ఎక్కడ నుండి వచ్చిందా ..? అనే కోణంలో చూస్తే , కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తిరుపతిలో వైసీపీని తట్టుకొని గెలవలేకపోయిన కానీ కనీసం టీడీపీని ఎదుర్కొని రెండో స్థానంలో నిలబడితే చాలు అనే ఆలోచనలో పవన్ కళ్యాణ్ ఉన్నట్లు తెలుస్తుంది. తెలంగాణ లో బీజేపీ పార్టీ తెరాస ను ఢీ కొట్టే సత్తా లేకపోయిన కానీ కాంగ్రెస్ ను వెనక్కి నెట్టి రెండో స్థానంలోకి రావటానికి ట్రై చేసి సక్సెస్ అవుతుంది. అదే విధంగా ఆంధ్రాలో కూడా వైసీపీని ఢీ కొట్టే సత్తా జనసేనాకు ఉందని నిరూపించుకోవటం కోసమే పవన్ కళ్యాణ్ తిరుపతి ఉప ఎన్నికల్లో పోటీచేయాలని భావిస్తున్నాడు. తిరుపతి అవకాశం వదులుకుంటే ఇక ఇలాంటి అవకాశం వచ్చే ఛాన్స్ లేదు కాబట్టి తిరుపతి విషయంలో గట్టి పట్టు పడుతున్నాడు.

పవన్ సత్తా సరిపోగలదా ..?

పార్లమెంట్ స్థానం నుండి పోటీచేయాలంటే అంగ బలం, అర్ద బలం గట్టిగా ఉండాలి. ఏడూ అసెంబ్లీ స్థానాలను సమన్వయము చేసుకుంటూ ఎన్నికలకు వెళ్ళాలి. అటు వైసీపీ కావచ్చు ఇటు టీడీపీ కావచ్చు, తమ తమ అభ్యర్థికి అన్ని బలాలను అందించగలుగుతాయి, కానీ జనసేన తరుపున అలాంటి బలం లేదనే చెప్పాలి. అదే బీజేపీ పోటీచేస్తే ఆ పార్టీకి వచ్చిన ఢోకా ఏమి లేదు. గెలుపు విషయం పక్కన పెడితే కనీస పోటీ ఇవ్వగలదు. పక్కనే కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం ఉంది కాబట్టి అటు నుండి మద్దతు వస్తుంది. గతంలో తిరుపతిలో ఒకసారి విజయం సాధించిన అనుభవం ఉండటం, స్థానికంగా బీజేపీకి బలం కూడా ఉండటంతో బీజేపీ గట్టి పోటీ ఇస్తుంది కానీ, జనసేన మాత్రం అంతగా అక్కడ ప్రభావం చూపించలేదు, కానీ పవన్ కళ్యాణ్ మాత్రం తిరుపతి సీటు కావాలని పట్టుపడుతున్నాడు. బీజేపీ నాయకత్వం అందుకు ఒప్పుకుంటుందో లేదో చూడాలి.

- Advertisement -

Related Posts

” ఫస్ట్ ఆ ఎన్నికలు , తరవాత ఈ ఎన్నికలు ” ప్రకటించేసిన జగన్, ఎవ్వడైనా సైలెంట్ అయిపోవాల్సిందే !

గత కొన్ని రోజుల నుండి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మొత్తం ఎన్నికల కమిషినర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చుట్టూ తిరుగుతున్నాయి. వైసీపీ ప్రభుత్వం ఆయనను ఒక ప్రభుత్వ అధికారి కంటే కూడా...

విజయవాడ దుర్గ గుడికి వెళ్ళే ప్రతీ ఒక్కరికీ సూపర్ గుడ్ న్యూస్

నరసరావుపేట మున్సిపల్‌ స్టేడియంలో నిన్న జరిగిన గోపూజ మహోత్సవంలో సీఎం వైఎస్‌ జగన్‌ పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్ధానాలు (టీటీడీ), దేవాదాయశాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని 2,679 ఆలయాల్లో కామధేను పూజ (గోపూజ) నిర్వహిస్తున్నారు....

ఆ విషయంలో ఎన్నడూలేనంత కంగారు పడుతున్న వైఎస్ జగన్?

ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ షెడ్యూల్ విడుదల చేయటం, జరపలేమంటూ అధికార ప్రభుత్వం హైకోర్టుకి వెళ్ళటం, జగన్ ప్రభుత్వానికి అనుకూలంగా కోర్టు తీర్పు...

అమ్మో హనుమ విహారి మామూలోడు కాదు , బిగ్ బాస్ 4 ఫ్యాన్స్ మనసులు కొల్లగొట్టాడు.

బిగ్ బాస్ అభిజీత్ కి ఇప్పుడు ఎంతటి క్రేజ్ వచ్చిందో అందరికీ తెలిసిందే. క్లాస్ చిత్రాల దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించగా 2012లో విడుదలైన ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ సినిమాతో టాలీవుడ్...

Latest News