చీరాల ఘటన రాష్ట్రంలో చిచ్చు రేపబోతుందా..? దీనికి వైసీపీనే కారణమా..?

amanchi karanam

 ప్రకాశం జిల్లా చీరాలలో జరిగిన సంఘటన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చిచ్చు రేపబోతుందా అంటే అవుననే చెపుతున్నారు టీడీపీ నేతలు. వైసీపీ నేతలు తమ ఆధిపత్యం కోసమే మత్స్యకారుల మధ్య చిచ్చు పెట్టారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రివర్యులు, శ్రీ కొల్లు రవీంద్ర విలేకరుల సమావేశంలో చెప్పుకొచ్చాడు.

amanchi karanam

చీరాలనియోజకవర్గంలో మత్స్యకారుల మధ్య మొదలైన గొడవకు కొన్ని రాజకీయశక్తులే కారణం. వైసీపీ నేతలు వారివారి వర్గాలను పెంచిపోషించడానికే ఇటువంటి వివాదాలు సృష్టిస్తున్నారు. ఆమంచి కృష్ణమోహన్, కరణం బలరామ్ లు తమ ఆధిపత్యంకోసం, మత్స్యకారులను తమవైపుకు తిప్పుకోవడం కోసమే వారిమధ్య చిచ్చుపెట్టారు. అధికారులు, పోలీసులు సకాలంలో స్పందించకపోవడం వల్లే అనేకమంది మత్స్యకారులు గాయాలుపాలయ్యారని కొల్లు రవీంద్ర అన్నారు.

బీసీలంతా కలిసుంటే తమ ఆటలు సాగవనే వైసీపీ ప్రభుత్వం మత్స్యకారుల మధ్య వివాదం సృష్టించింది. చీరాల నియోజకవర్గంలో మొదలైన చిచ్చు, రాష్ట్రమంతా వ్యాపించకముందే ప్రభుత్వం మత్స్యకారుల మధ్య మొదలైన గొడవను సామరస్యంగా పరిష్కరించాలి. చీరాల నియోజకవర్గంలో కఠారిపాలెం, వాడరేవు గ్రామాలకు చెందిన మత్స్యకారుల మధ్య, వలలవాడకం విషయంలో జరిగిన గొడవ దురదృష్టకరమని, కొందరు వ్యక్తులు, కొన్ని రాజకీయశక్తులు తమ స్వార్థం కోసం ఈ గొడవరేకెత్తేలా చేశారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీమంత్రి కొల్లురవీంద్ర ఆక్షేపించారు.

kollu ravindra tdp

జరిగిన వివాదంలో అమాయకులైన మత్స్యకారులు కేసుల్లో ఇరుక్కున్నారని, మరి కొందరు తీవ్రగాయాలపాలయ్యారని, చేపలవేటే ప్రధాన జీవనాధారంగా దానిపైనే ఆధారపడి బతుకుతున్న మత్య్సకార గ్రామాల మధ్యన స్వార్థపరులుపెట్టిన చిచ్చుకారణంగా జరగరాని నష్టం జరిగింద న్నారు. ప్రశాంతంగా ఉన్న మత్స్యకారులను రెచ్చగొట్టడం, వారిలో వారికే వివాదాలు సృష్టించడం, ఆస్తులవిధ్వంసం జరగడం బాధాకరమని రవీంద్ర వాపోయారు.

మత్స్యకారులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం, అధికారులు, అక్కడున్న సమస్యలను పరిష్కరిం చకుండా, కాలయాపన చేయడంవల్లే పరిస్థితి పూర్తిగా చేయిదాటిం దని రవీంద్ర స్పష్టంచేశారు. టీడీపీ ప్రభుత్వం వేటనిషేధ సమయంలో ప్రతి మత్స్యకార కుటుంబానికి రూ.4వేలవరకు పరిహారం ఇవ్వడంజరిగిందని, వేటాడటంకోసం వలలు, పడవలను కూడా ఉచితంగా ఇవ్వడం జరిగిందన్నారు. పేద, మధ్యతరగతికి చెందిన మత్స్యకారుల్లో 50ఏళ్లు పైబడినవారికి పింఛన్లు కూడా టీడీపీ ప్రభుత్వం అందించిందన్నారు. ఇళ్లపథకాలు, పడవలకు ఆయిల్ పై సబ్సిడీలు ఇవ్వడం కూడా చేశామన్నారు. అటువంటివే వీ చేయకపోగా, ఈప్రభుత్వం వారిలోవారికే మనస్పర్థలు సృష్టించి, కలిసిమెలిసి ఉన్నవారిని కాట్లాడుకునేలా చేసిందన్నారు. 13కులాలుగా ఉన్న మత్స్యకారులను చీల్చి, వారిలో వారే తగవులుపడేలా చేయడం బాధాకరమన్నారు.