ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు స్థానిక ఎన్నికల హడావిడి కొనసాగుతుంది. ఇప్పుడు ఈ ఎన్నికల్లో తమ సత్తాను చాటుకోవడానికి వైసీపీ, టీడీపీ నాయకులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే అనేక వ్యూహాలను రచించి, సిద్ధంగా ఉన్నారు. ఈ ఎన్నికల్లో అధిక స్థానాల్లో విజయం సాధించి, తమ సత్తాను మళ్ళీ ప్రపంచానికి చాటి చెప్పడానికి చంద్రబాబు నాయుడు కంకణం కట్టుకొని కూర్చున్నారు. అయితే పరిస్థితులు మాత్రం ఇప్పుడు టీడీపీకి పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నాయి.
నేతల దగ్గర పైసలు లేవా!
స్థానిక ఎన్నికల కోసం మొదట టీడీపీ నేతలు ఉత్సహం చుపించారు. కానీ ఇప్పుడు ఎన్నికలు వచ్చేసరికి టీడీపీ దిక్కులు చూస్తున్నారు. అనేక ప్రాంతాల్లో ఉన్న టీడీపీ నేతలు నామినేషన్ వెయ్యడానికి కూడా ముందుకు రావడం లేదు. పంచాయతీల్లో ఉన్న వాళ్లకు ఖర్చు పెట్టడానికి ముఖ్య నేతల దగ్గర డబ్బులు లేవంట. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినా నేతల దగ్గర కూడా పైసలు లేవని బాబుకు విన్నవించుకున్నారని రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. నిధుల కొరత అనే సమస్య వల్ల టీడీపీకి స్థానిక ఎన్నికల్లో ఓటమి ఖరారు అయ్యిందని తెలుస్తుంది.
ఓటమి తప్పదా!!
స్థానిక ఎన్నికల్లో ఇప్పటికే అనేక స్థానాల్లో ఏకగ్రీవాలకు వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు టీడీపీకి నిధుల కొరత ఏర్పటం అనేది వైసీపీ ఇంకా కలిసివచ్చే అంశంగా మారింది. ఈ నిధుల కొరతను టీడీపీ నాయకులు ఈ స్థానిక ఎన్నికల్లో ఎలాగా అధిగమిస్తారో వేచి చూడాలి. ఇప్పటికి వైసీపీ హవా రాష్ట్రంలో తగ్గలేదు. ఈ స్థానిక ఎన్నికల్లో వైసీపీ, టీడీపీ మధ్యన ఎలాంటి పోటీ జరుగుతుందో వేచి చూడాలి.