జనసేన- బీజేపీల మధ్య గొడవలు మొదలు అయ్యాయని చాలారోజుల నుండి వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఇరుపార్టీల నాయకులు ఈ వార్తలు ఖండిస్తూనే ఉన్నారు. అయితే ఇప్పుడు జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో జనసేన-బీజేపీల మధ్య ఉన్న గొడవలు మెల్లగా బయట పడుతున్నాయి. ఆ వివాదాలు ఎంత దూరం వచ్చాయంటే పొత్తును క్యాన్సల్ చేసుకోవాలని రెండు పార్టీల నేతలు చర్చలు జరుపుతున్నారని సమాచారం. ఒక బీజేపీ ఎంపీ చేసిన వ్యాఖ్యల పట్ల జనసేన నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
బీజేపీకి జనసేన అవసరం లేదు
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తాము జనసేన యొక్క మద్దతును కొరలేదని, జనసేన మద్దతు అవసరం లేదని బీజేపీ ఎంపీ అరవింద్ ఒక ఇంటర్వూలో చెప్పారు. అలాగే ఏ పార్టీ దగ్గర మేము వెళ్లలేదని, ఆ పార్టీలే తమ దగ్గరకు వచ్చాయని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యల పట్ల జనసేన నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కిషన్ రెడ్డి, కేంద్ర మంత్రులు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను బతిమిలాడిన విషయాన్ని ఎంపీ అరవింద్ గుర్తుచేసుకోవాలని జనసేన నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు.
పొత్తు క్యాన్సల్ అవుతుందా!!
గత కొన్ని రోజుల నుండి బీజేపీ-జనసేన మధ్య అభిప్రాయం భేదాలు వస్తూనే ఉన్నాయి. బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో తీసుకున్న నిర్ణయం పట్ల కూడా జనసేన అభ్యంతరం వ్యక్తం చేసింది. అలాగే ఇప్పుడు పోలవరం విషయంలో కూడా బీజేపీ వ్యవహరిస్తున్న తీరు పట్ల కూడా జనసేన ఆగ్రహం వ్యక్తం చేస్తూనే ఉన్నారు. అలాగే ఇప్పుడు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో, తిరుపతి ఉప ఎన్నికల్లో కూడా బీజేపీ జనసేనకు ప్రాధాన్యత ఇవ్వడం లేదు. దింతో విసుగు చెందిన జనసేన నాయకులు బీజేపీతో పొత్తును వీడనున్నారని సమాచారం.