ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేన, బీజేపీ పొత్తును ఎవ్వరూ ఊహించలేదు. ఎందుకంటే సిద్ధాంతాల పరంగా రెండు పార్టీలు వేరుగా ఉంటాయి. పూర్తిగా కుల, మత రాజకీయాలకు దూరంగా ఉంటూ జనసేన రాజకీయాలు చేస్తుంది, కానీ బీజేపీ మాత్రం వాటితోనే బీజేపీ చేస్తుంది. ఈ పొత్తు కలిసినప్పుడే ఈ రెండు పార్టీలు మళ్ళీ ఎంత త్వరగా విడిపోతాయని విశ్లేషణలు చేశారు. అయితే ఇప్పుడు నిజంగా బీజేపీ, జనసేన మధ్యన ఉన్న పొత్తు ఇప్పుడు క్యాన్సల్ అయ్యేలా ఉంది. దీనికి బీజేపీ చేస్తున్న రాజకీయాలే కారణమని, అలాగే బీజేపీ వల్ల జనసేనకు నష్టమే జరుగుతుంది.
సమయం కోసం ఎదురు చూస్తున్నారా!!
బీజేపీతో పొత్తును క్యాన్సల్ చేసుకోవడానికి పవన్ ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయంతో పవన్ ఇలా బయటపడ్డారని కూడా తెలుస్తోంది. చాలా రోజుల నుండి బీజేపీ ఏపీకి అన్యాయం చేస్తున్నప్పటికీ కేవలం పొత్తు వల్ల పవన్ ఏమి మాట్లాడలేకపోయారు. కానీ ఇప్పుడు ఈ అన్యాయలను సహించలేని పవన్ ఇప్పుడు బయటకు వచ్చి బీజేపీ వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. బడ్జెట్ లో ఏపీకి బీజేపీ తీవ్ర అన్యాయం చెయ్యడం పట్ల కూడా పవన్ తీవ్ర ఆగ్రహంగా ఉన్నారని, అవన్నీ కలిపి ఇప్పుడు పొత్తు నుండి బయటకు రావడానికి పవన్ సిద్ధమయ్యారని సమాచారం.
బీజేపీ వల్ల జనసేనకు నష్టమే
బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల జనసేనకు నష్టమే జరుగుతుంది. ఇప్పటికే పొత్తు తరువాత జనసేన రాష్ట్రంలో సెకండరీ పార్టీ అయిపోయింది. ఇప్పటికే తెలంగాణ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ నుండి తప్పుకోవలసి వచ్చింది. అలాగే బీజేపీకి ఉన్న కుల, మత రాజకీయాల రంగు ఇప్పుడు జనసేనకు కూడా అంటుకుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ పొత్తు నుండి బయటకు రావడమే మంచిదని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.