ఏపీలో ఇప్పటి నుండో వైసీపీకి, ఎన్నికల కమిషినర్ కు పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఒక యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధం తారా స్థాయికి చేరుకున్నప్పటికి ఈ యుద్ధంలో ఎన్నికల కమిషన్ గెలిచింది, పంచాయతీ ఎన్నికలను నిర్వహించింది. తమకు ఇష్టం లేకుండా ఏపీలో పంచాయతీ ఎన్నికలు జరగడం మాత్రం వైసీపీకి ఇష్టం లేదు. అయితే ఇప్పుడు వైసీపీకి మరో షాక్ ఇవ్వడానికి నిమ్మగడ్డ రమేష్ కుమార్ సిద్ధమయ్యారని రాజకీయ వర్గాలు చెప్తున్నాయి.
ఇంకొన్ని నోటిఫికేషన్స్ రానున్నాయా!!
నిమ్మగడ్డ రమేష్ కుమార్ యొక్క పదవి కాలం మార్చి 31న పూర్తికానుంది. ఈనెల 21న పంచాయతీ ఎన్నికలు ముగుస్తాయి. వెనువెంటనే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరిపేందుకు నిమ్మగడ్డ రమేష్ కుమార్ సిద్ధమయ్యారు. ఆ తర్వాత వరసగా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు కూడా జరపాలన్నది ఆయన ఆలోచనగా ఉంది. అన్ని స్థానిక సంస్థల ఎన్నికలను మార్చి 31వ తేదీలోపు పూర్తి చేయడంపై సాధ్యాసాధ్యాలను నిమ్మగడ్డ రమేష్ కుమార్ పరిశీలిస్తున్నారు. ఇప్పటికే తనకు నమ్మకమైన అధికారులతో ఆయన సమావేశమై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలపై చర్చించినట్లు సమాచారం. కొన్ని కార్పొరేషన్ ఎన్నికలు జరిపేందుకు న్యాయస్థానంలో కేసులు ఉన్నాయి.
వైసీపీకి ఇవ్వనున్న షాక్ ఏంటి??
పంచాయతి ఎన్నికల నేపథ్యంలో వైసీపీ నిమ్మగడ్డను చాలా ఇబ్బందులకు గురి చేశారు. కానీ ఆ ఇబ్బందులను తట్టుకొని మరీ ఎన్నికలను నిర్వహించిన రమేష్ ఇప్పుడు వైసీపీకి షాక్ ఇవ్వనున్నారు. అదేంటంటే తన పదవీకాలం మూడు నెలలు ప్రభుత్వం కావాలని తొలగించిందని, దానికి తిరిగి అవకాశం ఇవ్వాలని కోరుతూ నిమ్మగడ్డ రమేష్ కుమార్ న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నారని సమాచారం. ఒకవేళ నిమ్మగడ్డకు కోర్ట్ అవకాశం ఇస్తే వైసీపీ రానున్న మరిన్ని ఎన్నికలకు సిద్ధం కావాల్సి ఉంది.