నిహారిక భర్తను దూరం పెట్టిందా?

మెగా ఫామిలీ నుండి ఇప్పటికే చాలా మంది హీరోలు వచ్చారు. కానీ చిరంజీవి కూతుర్లు మాత్రం సినిమాల్లోకి రాలేదు. అయితే మొదటిసారి ఆ ఫామిలీ నుండి నాగబాబు కూతురు నిహారిక హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. చేసిన మూడు, నాలుగు సినిమాలు కూడా సరిగ్గా ఆడకపోవడంతో నిహారిక షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ మీద ఫోకస్ పెట్టింది.

ఒక ఏడాది క్రితం జొన్నలగడ్డ చైతన్యను పెళ్లి చేసుకొని ఓ ఇంటి కోడలిగా అడుగు పెట్టింది. అయితే పెళ్లి అయిన తర్వాత కూడా నిహారిక గ్లామర్ షో లు చేస్తూ కొంత ట్రోల్ల్స్ కి గురైయ్యింది. గతంలో తన జిమ్ ట్రైనర్ తో చనువుగా ఉండటం వల్ల బాగా విమర్శలు ఎదుర్కొంది.

తర్వాత  ఫుడింగ్ అండ్ మింక్ పబ్ రైడ్ లో డ్రగ్స్ కేసులో పోలీసుల అదుపులో చిక్కిన సంగతి తెలిసిందే.అలా కొన్ని రోజులు తన ఇన్ స్టాకు పూర్తిగా దూరంగా ఉండగా మళ్లీ తను రిఫ్రెష్ అయి ఇటీవలే ఇన్ స్టా లో అడుగు పెట్టింది.

ఈ మధ్య నిహారికి హాలిడేస్ కి బాగా వెళ్తుంది. కొన్నిరోజుల క్రితం బికినీ లో దిగిన ఫొటోస్ కూడా షేర్ చేసింది. హారిక ఒంటరిగా ప్రయాణం చేయడం.భర్త లేకుండా దిగిన ఫోటోలను పెట్టడంతో చాలామందికి అనుమానాలు వస్తున్నాయి.

దీంతో కొందరు నెటిజన్స్.నిహారికను ఎందుకు చైతన్యతో ఫోటోలు దిగటం లేదు అని అడగగా మరికొందరు.నిహారిక కూడా భర్తను దూరం పెట్టేసిందా.అందుకే అలా ఒంటరిగా ఉంటుందా అని కామెంట్స్ పెడుతున్నారు.