Narayana Institutions : నారాయణ విద్యా సంస్థలు.! ఆ సంస్థకు సంబంధించిన కార్యాలయాల్లో నారాయణ ఫొటోలు.. వెబ్‌సైట్‌లో కూడా నారాయణ వివరాలుంటాయ్. నారాయణ ఓ ఉపాధ్యాయుడిగా సాధించిన విజయాల గురించి ఆ విద్యా సంస్థల్లో గొప్పగా చెబుతుంటారు.
ఎవరైనా నారాయణ విద్యా సంస్థలు నారాయణవి కావంటే నమ్మగలరా.? ఆయన పీఏ మాత్రం, అసలు నారాయణకి నారాయణ విద్యా సంస్థలతో సంబంధాలే లేవంటున్నారు. రాజకీయాల్లోకి వస్తూనే నారాయణ విద్యా సంస్థలతో నారాయణకు సంబంధాలు తెగిపోయాయట. అలాగని నారాయణ పీఏ ఓ ఛానల్ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు.
నారాయణకు నారాయణ విద్యా సంస్థలతో సంబంధం లేనప్పుడు, ఆ విద్యా సంస్థల ఛెయిన్‌కి సంబంధించి ఎక్కడో ఏదో పొరపాటు జరిగితే, దానికి బాధ్యుడిగా నారాయణను చూపించి అరెస్టు చేయడమేంటన్నది ఆయనగారి పీఏ వాదన.
నారాయణ విద్యా సంస్థల్ని నారాయణ కుటుంబ సభ్యులు నడుపుతున్న మాట వాస్తవం. కొన్నాళ్ళ క్రితం నారాయణ తనయుడు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.. అదీ అది వేగంతో కారు నడుపుతూ, హైద్రాబాద్‌లో రోడ్డు ప్రమాదానికి గురవడం ద్వారా.
మొత్తమ్మీద, ప్రశ్నా పత్రాల లీకేజీ కేసు నుంచి బయట పడటానికి నారాయణ దగ్గర ఓ లాజికల్ పాయింట్ వుందన్నమాట. ఆ సంస్థలతో తనకు సంబందం లేదని నారాయణ న్యాయస్థానం ముందు చెబితే, ఈ కేసు నుంచి ఆయనకు ఊరట లభించినట్లే.