‘జగన్ రాజీనామా ‘ అన్న రఘురామ మాటల వెనక మోడీ మాయాజాలం ఉందా ?

Is modi is all bhind this

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాను చేసిన కోర్టు ధిక్కరణ తప్పిదం వలన పదవికి రాజీనామా చేయాల్సి రావొచ్చని వైయస్సార్ పార్టీ రెబల్ ఎంపీ రఘు రామ కృష్ణంరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలోనూ ఇలానే మాజీ సీఎంలు నీలం సంజీవరెడ్డి, ఎన్ జనార్ధన్‌రెడ్డి సైతం పదవులకు రాజీనామా చేశారని చెప్పుకొచ్చారు. రేపోమాపో కోర్టు ధిక్కరణ నోటీసులు తీసుకోవడానికి జగన్‌ సిద్ధంగా ఉండాలన్నారు రఘు రామ కృష్ణంరాజు. ఎంపీ రఘురామ శుక్రవారం తన రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎంపీ రఘురామ మాట్లాడుతూ.. సీఎం జగన్‌కు కోర్టు నోటీసులపై తమ పార్టీలో ఆందోళన వ్యక్తమవుతోందన్నారు. తప్పు ఒప్పుకుని కోర్టులను క్షమాపణ కోరితే సీఎం జగన్‌కు శిక్ష తప్పొచ్చన్నారు. ఎవరైనా కింది కోర్టు ఇచ్చిన తీర్పులపై పైకోర్టుకు వెళ్లడం సహజమని.. కానీ, వైసీపీ పెద్దలు మాత్రం జడ్జిల చిత్తశుద్ధి మీదచేసిన ఆరోపణలతో పెద్ద వివాదానికి తెరలేపారని ఎంపీ రఘురామ పేర్కొన్నారు.

Raghu raama krishnam raju comments on ys jagan

నిజంగా న్యాయ వ్యవస్థపై, సుప్రీం కోర్టుపై గౌరవం ఉంటే తమ ఫిర్యాదుపై చీఫ్‌ జస్టిస్‌ స్పందన కోసం వేచి చూసేవారే గాని.. ఫిర్యాదు పత్రాలు బహిర్గతం చేసే వారు కాదని న్యాయ నిపుణులు చెబుతున్నారని రఘురామ అన్నారు. మీడియా ముందు రచ్చ చేయడంతో వైసీపీ పెద్దల దురుద్దేశాలు బయటపడిపోయాయని వ్యాఖ్యానించారు.అలాగే రాష్ట్రంలో ఎన్ని సంక్షేమ పథకాలు అమలు చేసినా.. తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి జరిగిన విధంగా ఏపీలో సీఎం జగన్‌కు దుబ్బాక ఫలితం తప్పదని జోస్యం చెప్పారు. ఏపీలో ఎన్నిక జరిగితే ఆయన పార్టీ ఓడిపోకతప్పదని వ్యాఖ్యానించారు. అలాగే ఏపీకి అమరావతి మాత్రమే రాజధానిగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. రఘు రామ చేసిన ఈ సంచలన కామెంట్స్ కు వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఎలాంటి సమాధానం ఇస్తారో చూడాలి.