కేసీఆర్ ఉచ్చులో మోదీ చిక్కేనా..?

kcr modi

 కేసీఆర్ చూడటానికి బక్కపలచని వ్యక్తి, కానీ ఆయన నుండి వచ్చే మాటలు బాణాలు మాదిరి గుచ్చుకుంటాయి. ఎంతటి ప్రజా వ్యతిరేకత ఉన్నకాని, ఓకే ఒక్క ప్రెస్ మీట్ తో,ఒకే ఒక్క మాటతో తనకు అనుకూలంగా మలుచుకునే సత్తా కలిగిన నేత, అలాంటి నేతలు దేశ రాజకీయాల్లో చాలా అరుదుగా కనిపిస్తారు. అలాంటి కేసీఆర్ కు వరదల రూపంలో పెద్ద ఇబ్బంది వచ్చింది. హైదరాబాద్ లో వచ్చిన వరదలు కేసీఆర్ ఇమేజ్ ను చాలా వరకు దెబ్బ తీసింది.

hyderabad floods tr

 పైగా ఈ ఏడాది చివరిలో గ్రేటర్ ఎన్నికలు జరగబోతున్నాయి. దీని ప్రభావం కచ్చితంగా ఎన్నికల ఫలితాల మీద ఉండబోతుంది. ఈ గడ్డు కాలాన్ని ఎలా ఎదుర్కోవాలో తెరాస నేతలు భయపడిపోతున్నారు. హైదరాబాద్ లో ఇలాంటి దుస్థితి రావటానికి గత పాలకులదే తప్పు అనేలా తెరాస నేతలు మాట్లాడుతున్న ఎవరు నమ్మే పరిస్థితి కనిపించటం లేదు. అయితే కేసీఆర్ మాత్రం ఆ మాటను పక్కకు పెట్టి సరికొత్త స్ట్రాటజీ మొదలుపెట్టినట్లు తెలుస్తుంది. అకాల వర్షాలకు దెబ్బతిన్న హైదరాబాద్ సాధారణ స్థితికి రావటానికి కేంద్రం ఆర్థిక సహాయం చేయాలనీ కోరాడు. దానిపై మోడీ స్పందించకముందే కేసీఆర్ 550 కోట్లు విడుదల చేసి, సహాయ కార్యక్రమాలు మొదలుపెట్టారు.

  ఇప్పుడు మోడీ నుండి రాష్ట్రానికి ఎలాంటి సహకారం రాకపోతే, రేపటి ఎన్నికల్లో దానినే కేసీఆర్ హైలైట్ చేస్తూ, బీజేపీ పార్టీ పై విమర్శలు సంధించే అవకాశం వుంది. ఆ దెబ్బకు స్థానిక బీజేపీ నేతలు కనీసం ఓట్లు కూడా అడగలేని పరిస్థితి రావచ్చు, ఒకవేళ ఇప్పుడు మోడీ ఏమైనా నిధులు ఇచ్చిన కానీ, మొదటిగా కేసీఆర్ 550 కోట్లు కేటాయించాడు కాబట్టి దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కేంద్రం నిధులు ఇవ్వకపోతే రేపొద్దున్న ఎన్నికల్లో తలెత్తుకొని ప్రచారం చేయలేని పరిస్థితి తెలంగాణ బీజేపీ నేతలది, నిధులు ఇచ్చిన కానీ అనుకున్న స్థాయిలో ఆదరణ రావటం కష్టం, దీనితో బీజేపీ ఆలోచనలో పడిపోయింది. వరదలు కేసీఆర్ ను ఇబ్బందుల్లోకి నెట్టేస్తాయని భావిస్తున్న తరుణంలో వాటినే బీజేపీకి మీదకు మళ్లించి వాళ్ళని చిక్కుల్లోకి నెట్టటం చూస్తుంటే కేసీఆర్ యొక్క రాజకీయ చతురత సృష్టంగా అర్ధం అవుతుంది.