ఆంధ్ర ప్రదేశ్ లో టీడీపీ పార్టీ నుండి ఎవరు ఎప్పుడు వెళ్ళిపోతారో తెలియని పరిస్థితి నెలకొని వుంది. టీడీపీ కి నమ్మిన బంటులుగా భావించిన నేతలు కూడా తట్ట బుట్ట సర్దుకొని వెళ్లిపోతున్నారు, ఈ క్రమంలో ఉన్న నేతలను ఎలాగోలా కాపాడుకోవాలని భావిస్తున్న చంద్రబాబు నాయుడు భారీ స్థాయిలో పార్టీ జెండా మోసే పదవులు అందరికి పంచి పెడుతున్న కానీ టీడీపీ నుండి వలసలు ఆగటం లేదు.
తాజాగా ప్రకాశం జిల్లాకు చెందిన అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవి కుమార్ మీడియాకు దూరంగా ఉంటున్న కానీ, ఆయన పేరు మాత్రం ఎదో ఒక విధంగా మీడియాలో కనిపిస్తుంది. టీడీపీ నుండి గెలిచిన గొట్టిపాటి త్వరలోనే వైసీపీ లో చేరబోతున్నాడు అంటూ ఒక ప్రచారం జరుగుతుంది. నిజానికి గతంలోనే గొట్టిపాటి వైసీపీలో పోవాల్సి వుంది, కానీ అప్పట్లో అందుకు చంద్రబాబు అంగీకరించకుండా అద్దంకి నుంచి కరణం ఫ్యామిలీని చంద్రబాబు సక్సెస్ ఫుల్ గా చీరాలకు పంపడంతో తనకు తిరుగులేదని గొట్టి పాటి రవికుమార్ భావించారు.
చంద్రబాబు తన కోసం తీసుకున్న నిర్ణయానికి తాను పార్టీలో ఉండి ఆయనకు అండగా నిలవాలని గొట్టిపాటి రవికుమార్ భావించారు. ఆ తర్వాత కరణం బలరాం టీడీపీని వదిలి వైసీపీ కి వెళ్లటంతో సరేలే కరణం వెళ్లిన గొట్టిపాటి వున్నాడులే అనుకుంది టీడీపీ, కానీ వైసీపీ ప్రభుత్వం గొట్టిపాటి యొక్క వ్యాపారాలపై కొరడా రులిపిస్తూ, మైనింగ్ వ్యాపారాన్ని సీజ్ చేసేదాకా వెళ్లటంతో, హైకోర్టు ఎలాగోలా స్టే తెచ్చుకొని ప్రస్తుతానికి సేఫ్ అయ్యాడు, కానీ వైసీపీ మాత్రం రానున్న రోజుల్లో గొట్టిపాటిని టార్గెర్ చేయటం ఖాయమని తెలిసింది
ఇక దీనితో గొట్టిపాటి పార్టీ మారక తప్పదని భావించి, మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డిని హైదరాబాద్ లో కలిసి తాను పార్టీ మారే విషయం గురించి చెప్పినట్లు సమాచారం. అందుకు బాలినేని కూడా సుముఖం వ్యక్తం చేసి, ఈ విషయాన్నీ అధిష్టానం దృష్టికి తీసుకోని వెళ్తానని చెప్పినట్లు తెలుస్తుంది. నిజానికి గొట్టిపాటి 2014 ఎన్నికల సమయంలో వైసీపీ తరుపున గెలిచి, అనంతరం టీడీపీ లోకి మారిపోయాడు. అప్పటినుండి అద్దంకి లో కరణం వర్సెస్ గొట్టిపాటి గొడవలు మరింత ముదిరిపోయాయి. అయినాసరే గొట్టిపాటి టీడీపీ లోనే కొనసాగాడు, కానీ ప్రస్తుతం ఆయనకు పార్టీ మారకుండా ఉండలేని పరిస్థితులు కలిగాయి. ఒకవేళ గొట్టిపాటి వైసీపీ లోకి వెళితే మాత్రం కరణం వర్గం భగ్గుమనే పరిస్థితి కూడా లేకపోలేదు .