కన్నా టీడీపీలోకి వెళ్లనున్నారా!! ఇక ఆ ఎంపీ స్థానం కన్నాకేనా??

కన్నా లక్ష్మీ నారాయణకు తెలుగు రాజకీయాల్లో ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఆయన వేసిన రాజకీయ వ్యూహాలకు చాలామంది నేతలు రాజకీయాల నుండి తప్పుకున్నారు. అలాంటి నేత ఇప్పుడు ఆటలో అరటి పండులా మారారు. ఉమ్మడి రాష్ట్రంలో ఐదుసార్లు ఓట‌మి లేకుండా ఎమ్మెల్యేగా గెలిచారు. ప‌లువురు ముఖ్యమంత్రుల ద‌గ్గ‌ర మంత్రిగా విధులు నిర్వహించారు. అలాగే కాపు సామాజిక వ‌ర్గంలో కీల‌క నేత‌, పీసీసీ అధ్యక్షుడు ఇలా ఎన్నో ప‌ద‌వులు త‌న‌కు అలంకారంగా మార్చుకున్న ఆయ‌న 2014లో రాష్ట్ర విభ‌జ‌న నేప‌థ్యంలో తొలిసారి ఓడిపోయారు.

kanna lakshmi narayana
kanna lakshmi narayana

తరువాత బీజేపీలో వెళ్లారు. అక్కడికి వెళ్లిన తరువాత రాష్ట్ర అధ్యక్షుడిగా విధులు నిర్వహించారు. అయితే ఆయన నాయకత్వ లక్షణాలు నచ్చని బీజేపీ పెద్దలు రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయనను తొలగించి సోము వీర్రాజుకు అప్పగించారు. అప్పటి నుండి ఆయనకు పార్టీలో ప్రాధాన్యత లేకుండా పోయింది. బీజేపీ ఇప్పుడు అస్సలు ఆయనను పట్టించుకునే నాధుడే లేదు. అయితే ఇప్పుడు ఆయన రాజకీయ భవిష్యత్ చుట్టూ కొత్త ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

రాజకీయాల్లో ఒక వెలుగు వెలిగిన ఆయన ఇప్పుడు బీజేపీలో ఆటలో అరటిపండులా ఉండలేకపోతున్నారని, అందుకే ఆయన టీడీపీలోకి వెళ్ళడానికి సిద్ధమయ్యారని వార్తలు వస్తున్నాయి. అలాగే టీడీపీలోకి వస్తే సత్తెనపల్లి ఎంపీ స్థానం తనకే ఇస్తేనే వస్తానని టీపీడీ పెద్దలకు చెప్పినట్టు వార్తలు సోషల్ మీడియాలో సి చక్కర్లు కొడుతున్నాయి. మరి ఈ వార్తలు నిజమో కాదో కాలమే నిర్ణయించాలి.