తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో తెలుగు దేశం పార్టీ ఒక చెరగని ముద్ర వేసింది. తెలుగు రాజకీయాల్లో నూతన అధ్యాయాన్ని ప్రారంభించింది మాత్రం తెలుగుదేశం పార్టీనే. బడుగు బలహీనవర్గాల కోసం అన్న నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు చాలా దీన స్థితిలో ఉంది. ఎంతలా అంటే కనీసం వచ్చే ఎన్నికల సమయానికి పార్టీ ఉంటుందా అనే స్థాయికి చేరుకుంది. పార్టీ దీన స్థితిలో ఉంది కాబట్టి పార్టీని నడిపించడానికి జూనియర్ ఎన్టీఆర్ వస్తే బాగుంటుందని అందరూ భావించారు కానీ ఇక్కడే ఒక ఆసక్తికరమైన విషయం బయటపడింది.
జూనియర్ ఎన్టీఆర్ కొత్త పార్టీనా!!
అన్న నందమూరి తారక రామారావు పెట్టిన పార్టీ కోసం జూనియర్ ఎన్టీఆర్ పని చేస్తాడని అందరు అనుకున్నారు కానీ సడన్ ఇప్పుడు ఒక విషయం బయటకు వచ్చింది. గతంలో సొంతంగా పార్టీ పెట్టడానికి జూనియర్ ఎన్టీఆర్ దగ్గరకు టీడీపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు ప్రయత్నాలు చేశారని తెలుస్తుంది. ఆ ఇద్దరు ఎవరంటే ఒకరు కొడాలి నాని, మరొకరు పయ్యావుల కేశవ్. ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు రానున్న రోజుల్లో పార్టీ ఉండదని కాబట్టి ఇప్పుడు కొత్త పార్టీ పెడితే మంచిదని సలహా ఇచ్చారని సమాచారం. అయితే ఈ విషయం తెలుసుకున్న చంద్రబాబు నాయుడు కొడాలి నానిని, కేశవ్ దూరం పెట్టారు. దింతో కొడాలి నాని వైసీపీలో చేరారు.
జూనియర్ వస్తే టీడీపీ బలపడుతుందా!!
జూనియర్ ఎన్టీఆర్ కు తెలుగు ప్రజల్లో చాలామంది అభిమానులు ఉన్నారు. ఈ అభిమాన బలంతో రాజకీయాల్లోకి వస్తే ఎంతవరకు టీడీపీని బ్రతికించగలరని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఎందుకంటే అభిమాన బలంతో పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ ఒక్క సీట్ కూడా గెలవలేదు. కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ అభిమాన బలంతో ఎంత వరకు పార్టీని బతికిస్తారో వేచి చూడాలి.