`బిగ్ బాస్ ఫేం` నూతన్ నాయుడు పేరు మరోసారి వార్తల్లో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. నూతన్ నాయుడు ఇంట్లో దొంగతనం జరిగిందన్న నెపంతో ఓ యువకుడికి శిరోముండనం చేయించి అవమనించినట్లు వెలుగులోకి వచ్చింది. దీంతో నూతన్ నాయుడు పేరు ఇప్పుడు ఇంటా బయటా హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం నూతన్ నాయుడు అతని భార్యపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీంతో ఏపీలో అప్పుడే నూతన్ నాయుడిపై లేనిపోని రాజకీయాలు మొదలైపోయాయి. వెబ్ సహా ఎలక్ర్టానిక్ మీడియాలో అంది వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటూ రాజకీయ పార్టీలపై బురద జల్లే ప్రయత్నం మొదలు పెట్టాయి.
పచ్చ మీడియా వైసీపీ పై పడితే..పవన్ కళ్యాన్ వ్యతిరేక వర్గం జనసేనపై పడినట్లు కనిపిస్తోంది. నూతన్ నాయుడుని జనసేన పార్టీకి అంటగట్టి ఆపార్టీ అగౌరవ పరిచే ప్రయత్నాలు చేస్తున్నారు. జనసేనకు శిరోముండనం అంటూ వైసీపీ ఫాలోవర్స్ హడావుడి చేస్తున్నట్లు కొన్ని మెసేజ్ లు వైరల్ అవుతున్నాయి. అయితే ఇలాంటి చిల్లర పనులకు వైసీపీ దిగుతుందా? అన్నదే సందేహం. ఎందుకంటే వైసీపీ నాయకులు మొదటి నుంచి పవన్ కళ్యాన్ ని మరీ అంతగా టార్గెట్ చేసింది లేదు. చూసి చడనట్లే వదిలేసారు. అతన్ని పట్టించుకునేంత అవసరం ఆ పార్టీకీ లేదు. గతంలో ఇలాంటి రాజకీయాలు చేసింది టీడీపీ…పచ్చ బ్యాచ్. టీడీపీతో కొనసాగినంత కాలం పవన్ కళ్యాన్ వార్తల్ని కవర్ చేసిన పచ్చ మీడియా….ఆ పార్టీని వ్యతిరేకించి బయటకు వచ్చేసిన నాటి నుంచి టార్గెట్ చేసి ప్రతికూల కథనాలు వేస్తోంది.
కాబట్టి ఇప్పుడు చేతికి దొరికిన అస్ర్తాన్ని పచ్చ బ్యాచ్ ఎందుకు వదిలేసుకుంటుంది! అన్న అనుమానం రాకమానదుగా. వైసీపీ వ్యతిరేక వర్గం..పచ్చ మీడియా ఆడుతోన్న ఓ గేమ్ అంటూ మరో వాదన కూడా తెరపైకి వస్తోంది. బిగ్ బాస్ తర్వాత నూతన్ నాయుడు మెగా ఫ్యామిలీ అభిమానిగా ఫోకస్ అయ్యే ప్రయత్నాలు చేసిన సంగతి తెలిసిందే. ప్రజారాజ్యం పార్టీలో పనిచేసానని ఆ ఫ్యామిలీ అభిమానిగా ఎప్పటికీ కొనసాగుతానని అన్నారు. ఇటీవలే రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన సినిమాకు కౌంటర్ గా నూతన్ నాయుడు పరాన్న జీవిని తెరకెక్కించిన సంగతి తెలిసిందే. మరి ఇందులో కి నిజంగా రాజకీయ పార్టీలు దూరాయా? లేదా? అన్నది పోలీసులే నిగ్గు తేల్చాలి.