పరువు కాపాడిన ఆ జిల్లాలోనే టీడీపీకి చావుదెబ్బ..?

Chandrababu naidu

 2019 ఎన్నికల్లో రాష్ట్రంలోని 13 జిల్లాల్లో టీడీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. టీడీపీ కంచుకోట అనుకున్న జిల్లాలో కూడా పరువు కాపాడుకోలేకపోయింది. అలాంటి పరిస్థితిలో ప్రకాశం జిల్లాలో నాలుగు అసెంబ్లీ స్థానాలు టీడీపీ కైవసం చేసుకోవటం సాధారణమైన విషయం కాదు. చీరాల, అద్దంకి ,పర్చూరు, కొండెపి నియోజకవర్గాల్లో విజయం సాధించటంతో పార్టీ పరువు నిలబడింది.

damacharla janardhana

 దీనికి ప్రధాన కారణం ఆ జిల్లా పార్టీ అధ్యక్షుడు దామచర్ల జనార్దన్ అంటూ అప్పట్లో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి., కానీ ప్రస్తుత పరిస్థితులు అందుకు వ్యతిరేకంగా మారినట్లు కనిపిస్తుంది. పరుచూరులో ఏలూరి సాంబశివరావు.. దూకుడు కారణమే పనిచేసిందనేది టీడీపీ అంచనా. ఇక కొండపి ఎస్సీ నియోజకవర్గం. ఇక్కడ బాల వీరాంజనేయ పనితీరుకే ప్రజలు ఓటేశారని పార్టీ అంచ నాకు వచ్చింది. అద్దంకిలో రవి రాజకీయాలు కలిసివచ్చాయి. ఎటొచ్చీ.. చీరాలలోనూ జనార్దన్ హవా కన్నా.. ఆమంచి వ్యతిరేకత పార్టీకి కలిసి వచ్చిందని భావిస్తున్నారు.

 ఇదే సమయంలో ప్రకాశం జిల్లా టీడీపీ లో కమ్మ సామాజిక వర్గ నేతల ఆధిపత్యం ఎక్కువైందని ఆరోపణలు వినిపిస్తున్నాయి, ప్రతి నియోజకవర్గంలో కమ్మ నేతల డామినేషన్ ఎక్కువ అవుతుందని, చివరికి ఎస్సీ నియోజకవర్గంలో కూడా బయటి వారు వేలు పెడుతున్నారని, మరికొన్ని నియోజకవర్గాల్లోకి కమ్మ తమ్ముళ్ల మధ్యలోనే ఆధిపత్యం పోరు కొనసాగుతుందని తెలుస్తుంది. ఇవన్నీ కూడా దామచర్ల జనార్దన్ కు చిక్కులు తెచ్చిపెడుతున్నట్లు తెలుస్తుంది.

 మరో పక్క జనార్దన్ తమ్ముడు సత్య వ్యవహార శైలిపై కూడా అనేక ఆరోపణలు వస్తున్నాయి, సత్య ఈ మధ్య కాలంలో వైసీపీకి అనుబంధ నేతగా మారిపోయాడని, లోలోపల వైసీపీకి మద్దతు ఇస్తున్నాడనే మాటలు కూడా వినిపిస్తున్నాయి, ఇలాంటి తరుణంలో దామచర్ల మీద కూడా జిల్లా నేతల నుండి అనేక రూపాల్లో ఒత్తిడి రావటంతో ఇక జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలనే ఆలోచనలో జనార్దన్ ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే కేవలం ఒక్క అధ్యక్ష పదవికి మాత్రమే రాజీనామా చేస్తాడా లేక పార్టీకే రాజీనామా చేస్తాడా..? అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.