బాబును ఆదర్శంగా తీసుకుంటున్న జగన్..భారీ మూల్యం తప్పదు

cm jagan and chandrababu naidu

 చంద్రబాబుకు ఉన్నంత పబ్లిసిటీ పిచ్చి దేశంలో మరోనేతకు లేదని చాలా సందర్బాల్లో వైసీపీ నేతలే విమర్శించారు, వాళ్ళు చెప్పక పోయిన అప్పట్లో బాబుకి పబ్లిసిటీ అంటే మహా మోజు..అందుకోసం ఐదేళ్ల కాలంలో వేలకోట్లు ఖర్చుపెట్టినట్లు లెక్కలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు సీఎం జగన్ వాలకం చూస్తూనే అందుకు ఏమి తీసిపోడని తెలుస్తుంది. చంద్రబాబు రాష్ట్ర మీడియాతో తన పబ్లిసిటీ యావ తీర్చుకుంటే జగన్ మాత్రం ఏకంగా జాతీయ స్థాయి మీడియాతో టచ్ లోకి వెళ్ళిపోయాడు.

jagan telugu rajyam

 ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో అంత ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏంటి..? పైగా రాష్ట్ర మీడియాను పట్టించుకోకుండా జాతీయ మీడియాను ప్రాధాన్యత ఇవ్వటం ఏంటి..? ఒకటి రెండు పత్రికలతో విభేదాలు ఉన్నాయని ఏకంగా తెలుగు మీడియాను పట్టించుకోకపోవటం దారుణం, జగన్ ముందుగా ఈ వైఖరిలో మార్పు తెచ్చుకుంటే చాలా మంచిది. అదే సమయంలో ఎప్పుడు ఎక్కడ ప్రచారం చేస్తే తమకు అనుకూలంగా ఉంటుందో గమనించుకొని చేయాలి తప్పితే, అవేమి పట్టించుకోకుండా ఇష్టం వచ్చిన రీతిలో వ్యవహరిస్తే ముప్పు తప్పదు.

Print media telugu rajaym

ఇప్పటికే రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి మీడియా సలహాదారులను నియమించుకొని లక్షల్లో జీతాలు ఇస్తున్నాడు, దీనిపై కూడా విమర్శలు వస్తున్నాయి. ఉద్యోగులకు ఇవ్వాల్సిన మార్చి, ఏప్రిల్,సగం నెల జీతాలు ఇంకా ఇవ్వలేదు, వాళ్ళకి రావాల్సిన మూడు డీఏ లు ఇంకా పెండింగ్ లో ఉన్నాయి . ప్రతి నెల జీతాల కోసం అప్పులు చేయాల్సిన పరిస్థితి ఉంది. చుట్టూ ఇన్ని సమస్యలు పెట్టుకొని కూడా సీఎం జగన్ తన ఇమేజ్ కోసం కోట్లు ఖర్చుపెట్టటం సరైన నిర్ణయం కాదు. కేవలం పేపర్ లో పబ్లిసిటీ అనుకూలమైన వార్తలు ప్రింట్ వేపించుకుంటే ఎన్నికల్లో గెలుపు ఖాయమని భావిస్తే, చంద్రబాబు జీవితకాలం ముఖ్యమంత్రిగా ఉండేవాడు .. కాబట్టి ఇకనైనా జగన్ బాబు బాటను ఎంత త్వరగా వదిలిపెడితే అంత మంచిది, లేకపోతే మున్ముందు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది