తిరుపతి ఉప ఎన్నిక విషయం లో జగన్ కి జ్ఞాన బల్బ్ వెలిగిందా ?

ap cm jagan

 జగన్ ముఖ్యమంత్రి అయ్యి ఇప్పటికి 16 నెలల అవుతుంది. సీఎం అయినా మొదటి రోజు నుండి ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాడు జగన్, అభివృద్ధిని పక్కన పెట్టి మరి సంక్షేమానికే పెద్ద పీట వేస్తున్నాడని రాబోయే రోజుల్లో అది అంత మంచి పరిణామం కాదని కొందరు రాజకీయ విశ్లేషకులు చెప్పారు, కానీ జగన్ మాత్రం తాను అనుకున్న ప్రకారమే ముందుకు వెళ్తున్నాడు. అలాంటి జగన్ కు ఇప్పుడు బ్రేక్ పడే అవకాశం ఉందని తెలుస్తుంది, దీనితో తన నిర్ణయాల పట్ల సీఎం జగన్ ఒకసారి వెనక్కి తిరిగిచూసుకునే అవకాశం కూడా ఉన్నట్లు సమాచారం.

ap cm jagan

 తాజాగా తెలంగాణాలో దుబ్బాక ఉప పోరు జరిగింది. ఇందులో అసలు బలమే లేని బీజేపీ అధికారంలో ఉన్న తెరాస ను మట్టి కరిపించటం ఒక సంచలనం. ఇప్పుడు అదే విషయం జగన్ లో ఒక రకమైన భయానికి కారణమైందని కొందరు చెపుతున్నారు. మరికొద్ది రోజుల్లో తిరుపతి పార్లమెంట్ కు ఉప ఎన్నికలు జరగబోతున్నాయి. దుబ్బాకకు తిరుపతికి కొన్ని దగ్గర పోలికలు కనిపిస్తున్నాయి. స్థానిక ఎమ్మెల్యే చనిపోవటంతో దుబ్బాకలో ఉప ఎన్నికలు అనివార్యం అయ్యాయి. తిరుపతిలో కూడా సిట్టింగ్ ఎంపీ చనిపోవటంతో అక్కడ ఎన్నికలు జరగబోతున్నాయి.

 ఇలాంటి ఎన్నికల్లో సానుభూతి ఎక్కువగా పనిచేస్తుంది. కానీ దుబ్బాకలో మాత్రం సానుభూతి అక్కరకు రాలేదు, సోలిపేట రామలింగా రెడ్డి భార్య సరైన అభ్యర్థి కాదని తెలిసిన కానీ, తెరాస సానుభూతి కోసం ఆమెను పోటీలోకి దించింది. కానీ తెరాస అనుకున్న స్థాయిలో వర్కౌట్ కాలేదు. కాబట్టి తిరుపతిలో సానుభూతి ఓట్లు నమ్ముకోకూడదని వైసీపీకి దుబ్బాక ఎన్నికలు తెలియచేశాయి. ఇంకో అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే సంక్షేమ పధకాలు, సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పధకాలు మరోనేత ప్రవేశపెట్టలేదనే చెప్పాలి, కానీ అవి కూడా దుబ్బాకలో తెరాసను గెలిపించలేదు.

dubbaka elections

 ఏపీలో సీఎం జగన్ సంక్షేమ పధకాలు మాత్రమే అమలుచేస్తూ ముందుకు వెళ్తున్నాడు, ప్రతి నెలకు ఎదో ఒక రకంగా ప్రజలకు డబ్బులు పంచే విధంగా ఏర్పాట్లు చేస్తున్నాడు, అయితే దుబ్బాక ఫలితం చూశాక కేవలం సంక్షేమ పధకాలను నమ్ముకొని ఎన్నికలకు వెళితే కష్టమే అని అర్ధం అవుతుంది. పైగా తిరుపతిలో స్థానిక నేతల మధ్య విభేదాలు, ఇసుక కొరత లాంటి అనేక సమస్యలు కూడా ఉన్నాయి.

 కాబట్టి తిరుపతి ఉప ఎన్నికల్లో జగన్ సర్కార్ కొంచము అలసత్వం వహించిన మూల్యం చెల్లించుకోవాల్సిందే, ఇప్పటికే టీడీపీ తిరుపతి ఎన్నికల కోసం తగిన ప్రణాళికలు సిద్ధం చేసుకుంటుంది. బీజేపీ కూడా పోటీకి తాము సిద్దమే అంటూ ప్రకటించాయి, వాళ్ళను ఎదిరించి గెలవాలంటే కేవలం జగన్ కరిష్మా ఒక్కటే సరిపోదు, బలమైన అభ్యర్థి కావాలి, అదే సమయంలో అందుకు తగ్గ వ్యూహాలు కూడా రచించుకోవాలి. లేకపోతే దుబ్బాకలో వచ్చిన ఫలితం తిరుపతిలో కూడా రిపీట్ కావచ్చు.