ఫ్లాష్ బ్యాక్ నిజాలు : చంద్రబాబు – వైఎస్సార్ నిజంగా స్నేహితులేనా?

రాజకీయ సిద్ధాంతాలకు, వ్యతిగత సిద్ధాంతాలకు చాల తేడ ఉంటుంది. రాజకీయ నాయకులు పార్టీ సిద్ధాంతాల ప్రకారం తిట్టుకోవచ్చు. కానీ వారు వ్యతిగతంగా కలుసుకున్నప్పుడు చాల ఆప్యాయంగా పలకరించుకుంటారు. ఈ విషయం రాజకీయాలను చూసిన, గమనించిన వారు చెప్తూ ఉంటారు. అది కొంత వరకు నిజం కూడా. అయితే ఇప్పుడు వైఎస్ఆర్-సీబీన్ లు కూడా నిజ జీవితంలో స్నేహితులా అనే అంశం తాజాగా బయటకు వచ్చింది.

ఈ ఇద్దరు రాజకీయ శత్రువులు అనే విషయం మనందరికీ తెల్సు, అయితే వాళ్ళ మధ్య కూడా స్నేహ బంధం ఉందని కూడా కొంత మంది రాజకీయ నాయకులు చెప్తున్నారు. ఇందులో ఎంతవరకు నిజముందంటే కొంతవరకు నిజం ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే వాళ్ళిద్దరూ ఒకే సమయంలో రాజకీయాల్లోకి వచ్చారు. రెడ్డి కాంగ్రెస్ తరపున పులివెందుల నుండి వైఎస్ఆర్, కాంగ్రెస్ ఐ తరపున చంద్రగిరి నుండి చంద్రబాబు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు.

తరువాత కాలంలో ఇద్దరు కాంగ్రెస్ లో మంత్రులుగా కూడా పని చేశారు. ఇద్దరు ఒకే పార్టీలో ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరు స్నేహంగా ఉండేవారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే తరువాత కాలంలో చంద్రబాబు టీడీపీలోకి రావడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ ఉండటం వల్ల వాళ్ళిద్దరు రాజకీయ శత్రువులు అయ్యారు. వీళ్లిద్దరి స్నేహం విషయం ఇప్పుడెందుకు బయటకు వచ్చిందంటే ప్రస్థానం అనే మూవీని తీసిన దర్శకుడు దేవాకట్ట వీళ్ళిద్దరి సస్నేహంపై ఒక కల్పిత కథను వెబ్ సిరీస్ గా తీయడానికి పూనుకున్నారు.

ఈ నేపథ్యంలోనే ఈ బాబు-వైఎస్అర్ ల స్నేహ విషయం బయటకు వచ్చింది. రానున్న రోజులో ఈ వెబ్ సిరీస్ లేదా మూవీ రిలీజ్ అయితే ఎలాంటి వివాదాలు తెస్తుందో వేచి చూడాలి. అలాగే ఇప్పటికే వైఎస్ఆర్ పై యాత్ర అనే మూవీ వచ్చింది. అలాగే ఎన్టీఆర్ కథానాయకుడు, మహా నాయకుడు మూవీస్ లో చంద్రబాబు క్యారెక్టర్ ను ఎలివేట్ చేశారు. అలాగే బాబును విలన్ ను చేస్తూ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ తీశారు.