‘ఓవర్ ది టాప్’ – ఓటీటీ అనగానే బూతు కంటెంట్.. అనే అభిప్రాయం బలపడిపోయింది. కరోనా పాండమిక్ నేపథ్యంలో పెద్ద సినిమాలు కూడా ఓటీటీపై విడుదలయ్యాయి. అయితే, ఓటీటీ ముసుగులో కొందరు అసభ్యకరమైన కంటెంట్ వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రముఖ నిర్మాతలు కూడా తప్పనిసరై ఈ బూతుకి ఓటెయ్యాల్సి వస్తోంది. బూతు లేకపోతే ఓటీటీకి గ్లామర్ వుండడంలేదు. అదుపు తప్పిన గ్లామర్ కూడా ఫర్వాలేదనుకోవచ్చుగానీ, అచ్చంగా బూతు సినిమాల్ని ఓటీటీల్లో వదిలేస్తున్నారు. ఓటీటీ ఒక్కటే కాదు, కొందరైతే సొంతంగా యాప్‌లు తయారు చేసేసుకుని, వాటిల్లో పెయిడ్ కంటెంట్ పెడుతున్నారు. హైదరాబాదీ బ్యూటీ షెర్లీన్ చోప్రా కూడా ఇలాగే సొంతంగా బూతు వీడియోల్ని అమ్మేసుకుంటోంది.
ఈ వ్యవహారంపై ఆ మధ్య కేసు కూడా నమోదయ్యింది. తెలుగులో ఒకటీ అరా సినిమాల్లో నటించిన గెహనా వశిష్ట్ అనే మరో భామ కూడా ఇలాగే జుగుప్సాకరమైన రీతిలో వార్తల్లోకెక్కింది. పూనమ్ పాండే సంగతి సరే సరి. బూతుకి కేరాఫ్ అడ్రస్‌గా తయారైంది పూనమ్ పాండే. పైన చెప్పుకున్న ఏ ముగ్గురూ ఒకరి కంటే ఇంకొకరు తక్కువే కాదు.. బూతు విషయంలో. పెరిగిపోతున్న ఈ తరహా బూతు పైత్యంపై ఉక్కుపాదం మోపే దిశగా కేంద్రం చర్యలు చేపడుతోంది. తాజాగా కేంద్రానికి ఇంకోసారి సర్వోన్నత న్యాయస్థానం ఈ వ్యవహారంపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తోంది. ఓటీటీల్లో విచ్చలవిడిగా బూతు కంటెంట్ లభ్యమవుతోందనీ, దాన్ని నియంత్రించాలనీ సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. అయితే, పిల్లి మెడలో గంట కట్టేదెలాగన్నదే ఇక్కడ మిలియన్ డాలర్ల ప్రశ్న. దేశంలో ఇంటర్నెట్ వినియోగం పెరిగిపోయిది. ఆ వినియోగంలో కూడా ఎక్కువగా బూతు వీడియోలకే ప్రాముఖ్యత. ఇంటర్నెట్ వినియోగం తగ్గితే ఇంకేమన్నా వుందా.? చాలా కంపెనీలు మూసేసుకోవాలి. ఏమో, ఏం జరుగుతుందోగానీ ఎక్కడో ఓ చోట ఈ బూతుకి కల్ళెం పడాల్సిందే.