Shani Amavasya: శనిప్రభావ దోషం తొలగిపోవాలంటే శని అమావాస్య రోజు ఈ పరిహారం చేయాల్సిందే?

Shani Amavasya: సాధారణంగా ప్రతి నెల అమావాస్య పౌర్ణమి తిధులు రావడం సర్వసాధారణం. ఈ క్రమంలోనే ఈనెల 30వ తేదీ అమావాస్య రానుంది. ఈ అమావాస్య శనివారం రావడంతో ఈ అమావాస్యను శని అమావాస్య అని పిలుస్తారు.శని అమావాస్య రోజు శనీశ్వరునికి భక్తిశ్రద్ధలతో పూజలు చేయడం వల్ల శని ప్రభావ దోషం తొలగిపోతుందని పండితులు చెబుతున్నారు. శని ప్రభావం తొలగిపోవాలంటే శని అమావాస్య రోజు ఏ విధమైనటువంటి పరిహారాలు చేయాలి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం…

అమావాస్య శనివారం కావడంతో శనివారం ఉదయం రావి చెట్టుకు పూజలు చేయాలి. ఉదయమే రావిచెట్టుకు వెళ్లి నల్లనువ్వులను సమర్పించి అనంతరం ఆవు నూనెతో దీపారాధన చేసి రావిచెట్టుకు నమస్కరించుకోవాలి. ఈ విధంగా రావి చెట్టుకు పూజ చేయడం వల్ల శని ప్రభావం దోషం తొలగిపోతుంది. అదేవిధంగా శని ప్రభావ దోషం తొలగిపోవాలంటే శని అమావాస్య రోజు శనీశ్వరుడు ఆలయాన్ని సందర్శించి శనీశ్వరుడికి పూజలు చేయాలి.

ఈ విధంగా శనీశ్వరుడి ఆలయానికి వెళ్లి శని దేవుడికి నల్లనువ్వులను సమర్పించి పూజలు చేస్తూ శని చాలీసా పట్టించాలి. అనంతరం శని అమావాస్య రోజు బెల్లంతో తయారు చేసిన వస్తువులను దానం చేయడం వల్ల శని చల్లని చూపులు మనపై ఉంటాయి. అందుకే శని అమావాస్య రోజు బెల్లంతో తయారుచేసిన వస్తువులు దానం చేస్తారు.ఇలా చేయడం వల్ల మన జాతకంలో ఉన్నటువంటి శని ప్రభావ దోషాలే కాకుండా ఇతర దోషాలు కూడా తొలగిపోతాయి.