Home Andhra Pradesh గంటా శ్రీనివాసరావు బీజేపీలోకి వెళ్తున్నారా!!

గంటా శ్రీనివాసరావు బీజేపీలోకి వెళ్తున్నారా!!

తెలుగు రాష్ట్రాల్లో అధికారం చెప్పటడానికి బీజేపీ ఎంతలా ప్రయత్నిస్తుందో అందరికి తెలుసు. మొన్న తెలంగాణలోని దుబ్బాక ఉప ఎన్నికలలో వచ్చిన విజయంతో ఆంధ్రప్రదేశ్ బీజేపీ నాయకుల్లోనూ ఉత్సహం పెరిగింది. ఆ ఉత్సహం ఎంతలా పెరిగిందంటే వెంటనే సీఎం కుర్చీపై కూర్చోవాలన్నెంతగా. అందుకే సొంత నాయకులతో ఎదిగి రాజకీయంగా బలపడి ఓపిక లేని బీజేపీ పెద్దలు పక్క పార్టీల నేతలపై కన్ను వేశారు. పక్క పార్టీలో ఉన్న నేతలను ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో పార్టీలోకి తీసుకోవడం బీజేపీకి మొదటి నుండే అలవాటు.

Who Will Descend In To The Field To Save Ganta Srinivasara Rao
Ganta srinivasara rao

అయితే ఇప్పుడు కొత్తగా వైసీపీ, టీడీపీలో అసంతృప్తిగా నాయకులను పార్టీలోకి ఆహ్వానించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ప్రయత్నాల్లోనే గంట శ్రీనివాసరావును బీజేపీలోకి ఆహ్వానిస్తున్నారు. గంటా శ్రీనివాసరావు యొక్క రాజకీయ భవిష్యత్ ప్రశ్నర్థకంగా మారిన సమయంలో బీజేపీ గాలం వెయ్యడానికి ప్రయత్నాలు చేస్తుంది. గంటా ఇప్పుడు టీపీకి దూరంగా ఉన్నారు అలాగని వైసీపీలో చేరలేదు కనుక ఆయనను పార్టీలోకి తీసుకొని విశాఖ ప్రాంతాల్లో జెండా పాతడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.

విజయన‌గరం జిల్లాలో సీనియర్ టీడీపీ నేతగా ఉన్న మాజీ ఎమ్మెల్యే గద్దే బాబూరావుని బీజేపీ అక్కున చేర్చుకుంది. ఆయనకు ఇప్పటికే టీడీపీ వైసీపీలతో రాజకీయ సంబంధాలు ముగిసాయి.గంటా ఇంకా అధికారికంగా వైసీపీలోకి వెళ్ళలేదు కానీ టీడీపీ నాయకులు మాత్రం ఆయనను పూర్తిగా దూరం పెట్టారు. తాజాగా పార్టీ పదవుల పంపిణీలో చంద్రబాబు గంటా వర్గాన్ని పూర్తిగా పక్కన పెట్టారు. ఆయన కనీసం గంటా శ్రీనివాసరావుని ఏ దశలోనూ పరిగణనలోకి తీసుకోలేదు. వెనక వచ్చిన అనితను పొలిట్ బ్యూరో మెంబర్ ని చేసిన బాబుకు గంటాకు కూడా ఒక పదవి ఇవ్వడం కష్టం కాదు కానీ గంటాను కావాలనే దూరం పెట్టారు. ఈ విషయాన్ని అడ్డుగా చూపిస్తూ గంటాకు గాలం వెయ్యడానికి బీజేపీ ప్రయత్నిస్తుంది.

అలాగే విజయనగరంలో ఉన్న గంటా అనుచరులు మాజీ ఎమ్మెల్యేలు మీసాల గీత, కొండపల్లి అప్పలనాయుడులతో సహా ఓ అతి పెద్ద గ్యాంగ్ నే ఏకంగా బీజేపీలోకి ఆహ్వానించాలను కుంటోంది. ఉత్తరాంధ్ర మీద కన్నేసిన సోము వీర్రాజు అక్కడే పార్టీ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ పార్టీ బలోపేతానికి చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా గంటాను రమ్మని పిలిచినట్లుగా టాక్ అయితే నడుస్తోంది. ఒకవేళ గంటా శ్రీనివాసరావు వైసీపీలోకి వెళ్లకుండా బీజేపీలోకి వెళ్తే మాత్రం ఏపీ రాజకీయాలు కొత్త పుంతలు తొక్కడం ఖాయంగా కనిపిస్తుంది. రానున్న రోజుల్లో గంటా బీజేపీలోకి వెళ్తాడా లేదా చూడాలి.

- Advertisement -

Related Posts

వీర్రాజు ఆవేశంతో అభాసు పాలైన బీజేపీ ? ఇది చెయ్యకూడని తప్పు ?

రెండు తెలుగు రాష్ట్రాల్లో తమ జెండాను పాతడానికి బీజేపీ నాయకులు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే ఇప్పుడు తెలంగాణలో బీజేపీ తమకంటూ ఒక గుర్తింపును సంపాదించుకుంది. తెలంగాణలో సీఎం కేసీఆర్ కు చుక్కలు...

ఒక పక్క వ్యాక్సీన్ వేస్తుంటే – సడన్ గా భారీ ట్విస్ట్ ?

కరోనా వ్యాధికి దేశంలో వ్యాక్సినేషన్ ప్రారంభమయింది. మొదట ఆరోగ్య సిబ్బందికి ఇస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనూ వ్యాక్సిన్ ఇచ్చే ప్రక్రియ ప్రారంభమయింది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ… ముందుగా టీకాలు తీసుకునేవారితో మాట్లాడి.. నాలుగు మంచి మాటలు...

వాళ్ళంతా గౌతమ్ సవాంగ్ కే చుక్కలు చూపిస్తున్నారు .. బాబోయ్ ఇది పరాకాష్ట !

ఆంధ్రప్రదేశ్: ఆలయాల మీద జరిగిన దాడుల మీద శుక్రవారం నాడు రాష్ట్ర డీజీపీ గౌతం సవాంగ్ ఒక ప్రెస్ మీట్ పెట్టి కుట్రల వెనుక ఎవరున్నారన్నది బయట పెట్టారు. ఈ దాడుల వెనుక...

“అన్నా …మీరే న్యాయం చెప్పండి” అంటూ ఏడ్చేసిన అఖిలప్రియ!

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ బంధువుల్ని కిడ్నాప్ చేసిన ఘటనలో ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్టు కావటం.. ఆమె భర్తతో పాటు పలువురు అండర్ గ్రౌండ్ లో ఉండటం తెలిసిందే....

Latest News