ఆంధ్రప్రదేశ్ వైసీపీ-టీడీపీ మధ్యనున్న పోటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ రెండు పార్టీల నేతలు నిత్యం ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూనే ఉంటారు. అయితే ఇప్పుడు అధికారంలో ఉన్న వైసీపీ నాయకులు చంద్రబాబు నాయుడుపై చేస్తున్న వ్యాఖ్యలు మాత్రం చాలా వింతగా ఉన్నాయి. వైసీపీ ప్రభుత్వం యొక్క వైఫల్యాలను బాబుపైకి నెట్టేస్తూ వైసీపీ తప్పించుకుంది. బాబు అధికారంలో లేకపోయిన్నప్పటికి కీలక వ్యవస్థలను బాబే ఇంకా నడిపిస్తున్నాడని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు.
జగన్ భ్రమేనా ఇదంతా!!
గతంలో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు అనవసర భయాలతో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత కంటే ఎక్కువ ఇస్తూ జగన్ ను పెద్ద శక్తిగా మార్చారు. ఇప్పుడు జగన్ బాబు కూడా అడ్డుకోలేని శక్తిగా మారారు. అయితే ఇప్పుడు బాబు విషయంలో కూడా సీఎం జగన్ రెడ్డి అదే తప్పు చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వానికి వచ్చిన ప్రతి అడ్డంకికి బాబే కారణమని చెప్తూ బాబు యొక్క రాజకీయ చాణిక్యతను జగన్ నే చాటి చెప్తున్నారు. అధికారంలో లేని బాబే ఇంకా రాష్ట్రంలోని కీలక వ్యవస్థలను బాబు నడిపిస్తున్నాడని వైసీపీ నాయకులు ఆరోపిస్తూ బాబు యొక్క స్థానాన్ని వైసీపీ నాయకులు పెంచుతున్నారు. ఇలా జగన్ తన తప్పులను తెలుసుకోకుండా ఒక భ్రమలో ఉంటూ బాబును పెద్ద శక్తిగా ఉహించుకుంటున్నారని రాజకీయ వర్గాలు చెప్తున్నాయి.
తన తప్పులను జగన్ గుర్తించరా!!
జగన్ రెడ్డి తన పార్టీ పేరు కంటే కూడా చంద్రబాబు నాయుడు యొక్క పేరును ఎక్కువ వల్లిస్తున్నారు. తన ప్రభుత్వం యొక్క వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి బాబును జగన్ వాడుకుంటున్నారు. అయితే జగన్ రెడ్డి ఇలా చేస్తూ తన పాలనలో, తన పార్టీలో ఉన్న లోపాలను గుర్తించడం మనేశారని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. జగన్ తన సలహాదారులనుఁ మర్చికొని, రాజ్యాంగబద్ధమైన నిర్ణయాలు తీసుకోవాలి. స్థానిక ఎన్నికల విషయంలో న్యాయం ఎప్పటికైనా గెలుస్తుందని తెలుసుకున్న జగన్ రానున్న రోజుల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో వేచి చూడాలి.