అల్లు శిరీష్ ప్రేమతో ప్రయోగం.. చేతులు కాలవు కదా?

Is Allu Sirish doing experiment with love subject
Is Allu Sirish doing experiment with love subject
 
ప్రేమ కథలు ఎప్పుడూ ఎవర్ గ్రీన్ సబ్జెక్ట్. మనసుకు హత్తుకునేలా చూపిస్తే ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు. అదే సెటైరికల్ గా చేస్తే తిప్పికొడతారు. ఈరోజుల్లో ప్రేమ ఎలా ఉందంటే అనే క్వశ్చన్ వేసుకుని ఏదో వాస్తవాలను చూపాలనే ప్రయత్నంచేస్తే చేతులు కాలే ప్రమాదమే ఎక్కువ. ఈ ప్రయత్నంలో వచ్చిన చాలా సినిమాలు దెబ్బయ్యాయి. అయినా మళ్లీ ఇలాంటి ప్రయోగమే చేస్తున్నట్టు ఉన్నాడు అల్లు శిరీష్.  శిరీష్ చాలా కాలం తర్వాత కొత్త సినిమాను అనౌన్స్ చేశారు. రాకేష్ శశి ఈ సినిమాకు దర్శకుడు.  కొద్దిసేపటికి కృతమే టైటిల్ అనౌన్స్ చేశారు. 
 
టైటిల్ ఏమిటంటే ‘Prema కాదంట’.  ప్రేమ అనే పదాన్ని  ఆంగ్లంలో రాసి కాదంట అనే పదాన్ని తెలుగులో రాశారు.  అలా ఎందుకు రాశారో తెలీదు కానీ టైటిల్ పోస్టర్లో హీరో హీరోయిన్లు గట్టిగా వాటేసుకుని ప్రేమ కాదంట అనే టైటిల్ పెట్టడం చూస్తే ఈతరం ప్రేమికుల మీద సెటైర్ ఏదైనా వేస్తున్నారా అనే అనుమానం కలుగుతోంది.  ఒకవేళ ఈనాటి యువతకు అసలైన ప్రేమ అంటే ఏంటో తెలీదని చెప్పాలనే ప్రయత్నం చేస్తే ప్రయోగం చేసినట్టే. మరి శిరీష్ చేస్తున్నది ప్రయోగమా, ప్రయోగమే అయితే అది ఫలిస్తుందా లేదా అనేది చూడాలి.