IPL 2022: ఢిల్లీ క్యాపిటల్స్‌పై ఆర్‌సీబీ ఘన విజయం

Royal Challengers beat Sunriser

ఢిల్లీ క్యాపిటల్స్‌పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 16 పరుగులతో అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది. బెంగళూరు జట్టు ఈ సీజన్‌లో ఇది నాలుగో విజయం కాగా ప్రస్తుతం ఎనిమిది పాయింట్లతో పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి చేరుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. 190 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ జట్టు 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసి ఓటమి పాలైంది