ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట రాజకీయాలలో ఒక్కో పార్టీ ఒక్కొక్క ఎజెండాతో ముందుకు వెళ్తాయి. ఆ ఎజెండా టార్గెట్ గానే ఎన్నికల్లో ప్రచారం చేస్తాయి పార్టీలు. ఆ పై అధికారంలోకి వస్తాయి. వాటినే ముందుగా అమలు చేసే దిశగా ప్రయత్నాలు చేస్తాయి. ఇక ఏపీలో జగన్ మోహన్ రెడ్డి రైతులు, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా ముందుకు వెళ్తోన్న సంగతి తెలిసిందే. ఏడాది పాలన లో రాజధాని అంశం పక్కనబెట్టి ముందే సిద్దం చేసుకున్న మేనిఫెస్టోని అమలు చేసి నాయకుడిగా సగం సక్సెస్ అయ్యారు. ఈ విషయంలో కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీనే జగన్ పై ఎంతో సానుకూలంగా ఉంది. అందుకు నిదర్శనమే ఏడాది పాలనపై జగన్ ని కేద్రం మెచ్చడం.
కేంద్రానికి బాగా నచ్చిన సీఎంగా…మోదీ విథేయుడిగా మెలుగుతూ ముందుకు వెళ్లిపోతున్నారు. ఆ రకంగా కేంద్రంతో జగన్ కి మంచి సత్ససంబంధాలు బలపడ్డాయి. తాజాగా మోదీ ప్రకటించిన ప్యాకేజీపై జగన్ ఆసక్తికర ట్వీట్లు చేసారు. మరోసారి మోదీ విథేయుడిగా జగన్ నిలిచారు. శెభాష్ పీఎం సార్ అంటూ మోదీని మోసేసారు జగన్. ఎందుకంటరా? అయితే అసలు సంగతి లోకి వెళ్లాల్సిందే. నేడు ప్రధాని లక్ష కోట్లతో వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధిని ప్రారంభించారు. దీంతో జగన్ ఆనందానికి అవదుల్లేవ్. ఎందుకంటే జగన్ రైతుల పక్షపాతి కాబట్టి..కేంద్రం వ్యవసాయానికి సంబంధించి ఏం చేసినా జగన్ తప్పక మెచ్చుతారు అనడానికి ఇదొక మంచి మచ్చు తునక.
రైతు పండిచిన పంటలకు విలువలును జోడించడానికి స్థిరమైన ఆదాయాలు పొందడానికి ఈ నిధి అవకాశం కల్పిస్తుందని జగన్ ఆశాభావం వ్యక్తం చేసారు. దీని ద్వారా వ్యవసాయంలో మెరుగైన ఆర్ధిక వ్యవస్థకు ఆస్కారం ఉంటుందన్నారు. మొత్తం 11 ప్రభుత్వ రంగ బ్యాకులతో కేంద్ర వ్యవసాయ శాఖ ప్రారంభించింది. తొలి విడతగా 2280 మంది రైతులకు 1000 కోట్లు రిలీజ్ చేసారు. ఈ నిధి ద్వారా రైతులు తమ సొంత గ్రామాల్లోనే పంటలను నిల్వ చేసుకునే ఏర్పాటు సౌకర్యం ఉంటుంది. మొత్తానికి మోదీ సాబ్ కొత్త ప్యాకేజీ జగన్ కి కాస్తా..కూస్తో కలిసొచ్చే అంశమనే అనాలి. ఇప్పటికే ప్రభుత్వం రైతుల కోసం రాష్ర్ట వ్యాప్తంగా కొన్ని కేంద్రాల్లో శీతల గిడ్డంగులు ఏర్పాటు చేస్తుంది. అలాగే రైతు పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే.