Prabhas: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. బాహుబలి సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈయన ఈ సినిమాతో మంచిగా సక్సెస్ అందుకున్నారు. ఈ సినిమా తర్వాత ప్రభాస్ నటిస్తున్న సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలోనే విడుదల అవుతున్న నేపథ్యంలో వరుస షూటింగ్లలో పాల్గొంటూ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ప్రభాస్ కల్కి, సలార్ సీక్వెల్ సినిమా షూటింగ్స్ లో బిజీగా ఉన్నారు వీటితో పాటు మారుతి డైరెక్షన్ లో రాబోతున్న రాజా సాబ్, సందీప్ రెడ్డి స్పిరిట్, హను రాఘవపూడి ఫౌజి సినిమా పనులలో బిజీగా గడుపుతున్నారు.
ఇక ఇప్పటివరకు ప్రభాస్ ఎన్నో సినిమాలలో నటించారు. అయితే ఈ సినిమాలన్నింటిలో కూడా ప్రభాస్ విభిన్నమైనటువంటి పాత్ర ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు, ఇలా ఎన్నో విభిన్న పాత్రలలో నటించిన ప్రభాస్ ఇప్పటివరకు డాక్టర్ పాత్రలో ఎక్కడ కనిపించలేదు. ఇలా ప్రభాస్ డాక్టర్ పాత్రలో కనిపించకపోవడానికి కూడా కారణం లేకపోలేదని చెప్పాలి.
ఒక డాక్టర్ పాత్రలో నటించాలి అంటే తప్పనిసరిగా సర్జరీలు అంటూ కత్తులు అలాగే ఇంజక్షన్లు వంటివి పట్టుకోవాల్సి ఉంటుంది ఎంత నటన అయినా కూడా ఇలాంటి వస్తువులను వాడాల్సి ఉంటుంది కానీ ప్రభాస్ కి చిన్నప్పటినుంచి కూడా ఇంజక్షన్ అంటే ఒక రకమైన భయం ఉందట ఆ ఫోబియా కారణంగానే ఈయన డాక్టర్ పాత్రలలో ఇప్పటివరకు నటించలేదని తెలుస్తుంది. ఒకవేళ కథ డిమాండ్ చేస్తే తప్పకుండా నటిస్తానని కానీ కాస్త భయం ఉంటుంది అంటూ ఓ సందర్భంలో చెప్పినట్టు తెలుస్తోంది.
ఇలా ప్రభాస్ కి ఇంజక్షన్ అనే ఫోబియా ఉందని తెలిసి ఫాన్స్ ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. ఇక ప్రభాస్ ఈ ఏడాది రాజా సాబ్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మారుతి డైరెక్షన్ లో తేరకేక్కిన ఈ సినిమాలో ప్రభాస్ లుక్ చాలా డిఫరెంట్ గా ఉందని ఇదొక కామెడీ సస్పెన్స్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తుంది.