గాసిప్స్ : “ఆదిపురుష్”లో ప్రభాస్ వాయిస్ తో ఇలాంటి ప్రయోగం చేస్తున్నారా?

ప్రస్తుతం ఫ్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ఇప్పుడు పలు భారీ చిత్రాలు చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. వాటిలో వరుసగా హిందీ దర్శకుడు ఓంరౌత్ తో చేస్తున్న “ఆదిపురుష్” దీని తర్వాత మాస్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో చేస్తున్న క్రేజీ మాస్ ప్రాజెక్ట్ “సలార్” కూడా ఒకటి. 

అయితే ప్రభాస్ ఆదిపురుష్ ని తెలుగు హిందీ భాషల్లో ఒకేసారి తెరకెక్కిస్తుండగా ఇప్పుడు ప్రభాస్ డబ్బింగ్ కి సంబంధించి పలు గాసిప్స్ వినిపిస్తున్నాయి. అయితే వీటిలో ఎంతవరకు నిజముందో కానీ ఈ వార్త మాత్రం ఒకింత ఇంట్రెస్టింగ్ గా ఉందని చెప్పాలి. 

ఈ సినిమాలో ప్రభాస్ వాయిస్ ని రికార్డు చేసి దాదాపు అన్ని భాషల్లో డబ్బింగ్ డైలాగ్స్ ఆ వాయిస్ తోనే ఉండేలా ఒక కొత్త టెక్నాలజీ తో చేయిస్తున్నారని తెలుస్తుంది. అంటే ప్రభాస్ వాయిస్ వినిపిస్తుంది కానీ అనేక భాషల్లో మాత్రం ప్రభాస్ డబ్బింగ్ ఉండదట. 

స్ట్రిక్ట్ గా ఉంటే ఒక్క తెలుగులో మాత్రమే ప్రభాస్ ఒరిజినల్ డబ్బింగ్ ఉంటుంది అని మిగతా అంతా ఆ టెక్నాలజీతోనే ఉంటుందని రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇది ఒకింత ఇంట్రెస్టింగ్ గా ఉన్నా నిజంగా ఉంటుందో లేదో అనేది తెలియాల్సి ఉంది. మరి ఈ సినిమా రామాయణం ఆధారంగా తెరకెక్కగా ప్రభాస్ రామునిగా, కృతి సనన్ సీతగా నటిస్తుంది. అలాగే లంకేశునిగా సైఫ్ అలీఖాన్ నటిస్తున్నాడు. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరిలో రిలీజ్ కాబోతుంది.