అల్లు అర్జున్ అతి మామూలుగా లేదే..!

టాలీవుడ్ లో చాలా మంది హీరోలు తమకి ఎంత స్టార్డం ఉన్నప్పటికీ చాలా సెటిల్డ్ గానే ఉంటారు. అయితే మరికొందరు అలా ఉంటూనే కొన్ని సందర్భాల్లో మాత్రం సోషల్ మీడియాలో తెలిసో తెలీక బాగా స్ట్రైక్ అవుతూ ఉంటారు. అయితే ఈ కోవలోకి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా చెందుతాడు అని చెప్పవచ్చు.

ఎందుకంటే ఇప్పుడు తాను పాన్ ఇండియా స్టార్డం తెచ్చుకున్నప్పటికీ దానిని ఏదొకలా తనకి తానే చెప్పుకుంటూ హైలైట్ చేసుకుంటున్నట్టుగా పలు సందర్భాలు చూస్తే అనిపిస్తుంది. టాలీవుడ్ లో మొదటి పాన్ ఇండియా స్టార్ అంటే అది ప్రభాస్ అనే అంటారు. కానీ దానిని కూడా అల్లు అర్జున్ ఓ సమయంలో ఓ ప్రోగ్రాం లో యాంకర్ చేత వాడేసుకున్నాడు.

కాగా ఇప్పుడు మళ్ళీ ఇలాంటి ఇన్సిడెంట్ జరగడంతో ఫ్యాన్స్ లో మళ్ళీ ట్రోల్స్ స్టార్ట్ అయ్యాయి. రీసెంట్ గా అల్లు అర్జున్ కి మడమే తుస్సాడ్ లో తన మైనపు బొమ్మను ఆవిష్కరించనున్నారని కన్ఫర్మ్ అయ్యింది. అందుకు బన్నీ వెళ్లి కొలతలు కూడా ఇచ్చాడు. కానీ ఇది అల్లు అర్జున్ కి మొదటి సారి కానీ ఇండియన్ సినిమా దగ్గర కానీ టాలీవుడ్ లో కానీ పాతే.

ఇది వరకే మహేష్ బాబు ప్రభాస్ లకి కూడా మైనపు బొమ్మలు వారు చేసి అరుదైన గౌరవాన్ని అందించారు. కానీ నిన్న మంగళవారం ఈవెంట్ లో మాత్రం బన్నీ తానే మొదటి టాలీవుడ్ హీరో అన్నట్టుగా స్క్రీన్స్ పై వేయించుకున్నాడు. దీనితో ఈ పబ్లిసిటీ పిచ్చి మాత్రం ఇంకా తగ్గలేదు అని ఇతర ఫాన్స్ ట్రోల్స్ చేస్తున్నారు.