గడిచిన కొన్నేళ్లలో తెలుగు సినిమా ఎంతలా షైన్ అయ్యిందో అందరికీ తెలిసిందే. మెయిన్ గా పాన్ ఇండియా మార్కెట్ లో అయితే తెలుగు సినిమా పాగా వేసింది. కానీ ఇప్పుడు మాత్రం కాస్త తక్కువ సినిమాలతో వెనక్కి వెళ్ళింది అని చెప్పాలి. కాగా ఈ ఏడాదిలో వచ్చిన చిత్రాలు తక్కువే ఉంటే వాటిలో అన్ని అంచనాలు పెట్టుకొని వచ్చిన సినిమానే “సలార్”.
బాహుబలి సినిమాతో పాన్ ఇండియా మార్కెట్ తెచ్చుకున్న ఈ చిత్రం ఒకప్పుడు ఉన్న హైప్ లో రిలీజ్ చేసి ఉంటే ఈజీగా 200 కోట్ల వసూళ్లు మొదటి రోజు వచ్చేవి కానీ చివర నిమిషంలో మేకర్స్ చేసిన డిజప్పాయింటింగ్ పనులకి హిందీ వసూళ్లు బాగా దెబ్బ పడ్డాయి. హిందీలో సలార్ కి చాలా బిలో యావరేజ్ వసూళ్లు వచ్చాయి.
ప్రభాస్ గత చిత్రం ఆదిపురుష్ కన్నా తక్కువ వసూళ్లు సలార్ కి నమోదు కావడం విశేషం. కాగా సలార్ కి హిందీలో కేవలం 15 కోట్లు మాత్రమే వసూలు కావడం షాకింగ్ గా మారింది. ఐతే మరో పక్క షారుఖ్ ఖాన్ సినిమా ఉంది కాబట్టి తక్కువ వచ్చాయని కొందరు అంటున్నారు.
కానీ ఈ మాస్ కాంబినేషన్ కి మాత్రం తక్కువే అని చెప్పొచ్చు. పైగా షారుఖ్ సినిమాకి అంత సూపర్ పాజిటివ్ టాక్ కూడా రాలేదు. సరే ఇది పక్కన పెడితే రెండో రోజు సలార్ కి మరింత దారుణమైన పరిస్థితి ఉన్నట్టుగా అంటున్నారు. వీటితో అయితే హిందీలో మాత్రం సలార్ చాలా తక్కువ నంబర్స్ తోనే ఎండ్ అయ్యేలా ఉందని చెప్పక తప్పదు.