‘సలార్’ సినిమా చూశాక, ప్రభాస్ విషయమై అతని అభిమానుల్లోనూ చాలా చాలా అనుమానాలు పెరిగిపోయాయ్. అంతకు ముందు ‘ఆదిపురుష్’ విషయంలోనూ ప్రభాస్ అభిమానులు చేదు అనుభవాన్నే ఎదుర్కొన్నారు.
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సలార్ – సీజ్ ఫైర్’ సినిమాలో, ప్రభాస్ స్క్రీన్ స్పేస్ నిజానికి చాలా చాలా తక్కువే. ప్రభాస్‌కి ఇచ్చిన డైలాగులూ తక్కువే. పెద్దగా ఎక్స్‌ప్రెషన్స్ అవసరం లేకుండానే పనికానిచ్చేశారు ప్రభాస్‌తో.
ఎందుకిలా.? ప్రశాంత్ సినిమాలే అంత.. అనుకోలేకపోతున్నారు ప్రభాస్ అభిమానులు. మరి, ప్రభాస్ తదుపరి సినిమా ‘కల్కి’ విషయంలో ఏం జరగబోతోంది. ఈ సినిమాకి సంబంధించి తాజాగా ఓ పాట చిత్రీకరణ జరుగుతోంది.
పాటలో ప్రభాస్ ఇదివరకటిలా వేగంగా కదిలాడా.? డాన్సులు అదరగొట్టేశాడా.? అన్న ఉత్కంఠ అభిమానుల్లో కలుగుతోంది. కానీ, ‘ఏమో చెప్పలేం..’ అన్న నిరాశతోనూ కనిపిస్తున్నారు ప్రభాస్ అభిమానులు.
ప్రభాస్ అంటే ఒకప్పుడు మెరుపు వేగం. డాన్సుల్లో అదరగొట్టేసేవాడు. యాక్షన్ ఎపిసోడ్స్ అయినా అంతే.! ‘బాహుబలి’ తర్వాత మొత్తం మారిపోయింది. బ్యాక్ టు బ్యాక్ వరుసగా నిరాశపరుస్తూ వచ్చాడు.
‘సలార్’ కాస్త ఫర్వాలేదన్పించిందంతే. ప్రభాస్ స్టామినాకి తగ్గ సినిమా అయితే కాదు.! మరి, ‘కల్కి’తో ఏం చేస్తాడో.! ఆ సంగతి తర్వాత, ప్రభాస్ స్క్రీన్ స్పేస్ ఎంత.? ఇదే పెద్ద చిక్కు ప్రశ్నలా తయారైంది.