మనసంతా నువ్వే స్క్రిప్ట్ ను మహేష్ కు చేరకుండా అడ్డుకున్న వ్యక్తి ఎవరో తెలుసా?

ఉదయ్ కిరణ్ సినీ కెరీర్ లోని బ్లాక్ బస్టర్ హిట్లలో మనసంతా నువ్వే సినిమా ఒకటనే సంగతి తెలిసిందే. రీమాసేన్ హీరోయిన్ గా ఎం.ఎస్.రాజు నిర్మాతగా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే మహేష్ బాబు హీరోగా నటించాల్సిన మనసంతా నువ్వే ఉదయ్ కిరణ్ కు చేరడం వెనుక ఆసక్తికర కథ ఉంది. దేవీ పుత్రుడు ఫ్లాప్ తో ఎం.ఎస్.రాజుకు భారీగా నష్టాలు మిగిలాయి.

వీఎన్ ఆదిత్య లవ్ స్టోరీతో ఎం.ఎస్.రాజు దగ్గరకు రాగా ఎం.ఎస్.రాజు రెండు స్టోరీ లైన్స్ ను ఆదిత్యకు చెప్పారు. మొదటి స్టోరీ లైన్ ప్రేమించుకుందాంరా సినిమాను పోలి ఉండటంతో ఆ లైన్ తో సినిమా చేయలేనని వీఎన్ ఆదిత్య అన్నారు. వేర్వేరు సినిమాల నుంచి కొన్ని సన్నివేశాలను ఈ సినిమాలో ఇన్స్పైర్ అయ్యారు. ఈ విధంగా స్క్రిప్ట్ సిద్ధం కాగా స్క్రిప్ట్ అద్భుతంగా వచ్చింది. ఎం.ఎస్.రాజు ఈ సినిమాను నిర్మించడానికి సిద్ధమయ్యారు.

ఎం.ఎస్.రాజు కొత్త డైరెక్టర్ కు ఛాన్స్ ఇవ్వడం గురించి ఇండస్ట్రీలో చర్చ జరిగింది. ఎం.ఎస్.రాజు మహేష్ తో సినిమా చేయాలని అనుకోగా వీఎన్ ఆదిత్య ఉదయ్ కిరణ్ తో సినిమా చేద్దామని చెప్పారు. ఒకవేళ మహేష్ బాబు ఈ సినిమాలో నటించి ఉంటే మాత్రం ఈ సినిమా మరింత పెద్ద హిట్ గా నిలిచి ఉండేది. క్లైమాక్స్ గురించి పరుచూరి బ్రదర్స్ మొదట నెగిటివ్ కామెంట్లు చేశారు.

మనసంతా నువ్వే బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ తర్వాత ఎం.ఎస్.రాజు పలు సినిమాలకు నిర్మాతగా వ్యవహరించగా ఆ సినిమాలు కూడా విజయాలను సొంతం చేసుకున్నాయి. అయితే ప్రస్తుతం ఎం.ఎస్.రాజు సినిమాల నిర్మాణానికి దూరంగా ఉంటున్నారు. కొన్ని సినిమాల వల్ల భారీ నష్టాలు మిగలటంతో నిర్మాత ఎం.ఎస్.రాజు ఈ సంచలన నిర్ణయం తీసుకున్నారు.