సింహాద్రి సినిమాను బాలయ్యకు చేరకుండా అడ్డుకున్న వ్యక్తి ఎవరో మీకు తెలుసా?

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన నందమూరి బాలకృష్ణ గత 20 ఏళ్లలో నటించిన సినిమాలలో ఏడు సినిమాల కంటే ఎక్కువ సినిమాలు సక్సెస్ కాలేదు. అయితే సక్సెస్ ఫెయిల్యుర్ తో సంబంధం లేకుండా బాలయ్య సినిమాలకు బిజినెస్ జరుగుతుంది. అయితే బాలయ్య వదులుకున్న బ్లాక్ బస్టర్ సినిమాలలో సింహాద్రి ఒకటనే సంగతి తెలిసిందే. రాజమౌళి ఎన్టీఆర్ కాంబినేషన్ లో తెరకెక్కిన సింహాద్రి సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది.

రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ వసంత కోకిల సినిమాను స్పూర్తిగా తీసుకుని సింహాద్రి స్క్రిప్ట్ ను సిద్ధం చేశారు. విజయేంద్ర ప్రసాద్ శిష్యుడు గణేష్ సూచన మేరకు ఇంటర్వెల్ ట్విస్ట్ ను తయారు చేశారు. అన్ని అంశాలతో ఉన్న కథ తయారవ్వగా ఈ సినిమా కథ రాజమౌళికి ఎంతో నచ్చింది. విజయేంద్ర ప్రసాద్ బాలయ్య బి.గోపాల్ కాంబినేషన్ లో ఈ సినిమాను తెరకెక్కిస్తే బాగుంటుందని భావించారు.

బి.గోపాల్ సింహాద్రి కథ విని రొటీన్ గా ఉందని చెప్పగా విజయేంద్ర ప్రసాద్ మళ్లీ ఆలోచనలో పడ్డారు. ఒకవేళ బాలయ్య ఈ సినిమా కథ విని ఈ సినిమాలో నటించి ఉంటే మాత్రం బాక్సాఫీస్ వద్ద బాలయ్య రికార్డులు సృష్టించి ఉండేవారు. ఆ తర్వాత ఎన్టీఆర్ విజయేంద్ర ప్రసాద్ కు కాల్ చేసి బొబ్బిలి సింహం లాంటి కథ తన సినిమాకు కావాలని అడిగారు. రాజమౌళి అదే సమయంలో సింహాద్రి కథతో ఎన్టీఆర్ ను అప్రోచ్ అయ్యారు.

ఎన్టీఆర్ రాజమౌళి కాంబినేషన్ లో దొరస్వామిరాజు నిర్మాతగా తెరకెక్కిన ఈ సినిమా భారీ అంచనాలతో విడుదలై ఈ సినిమా సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. 8 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా భారీ కలెక్షన్లను సాధించింది. యావరేజ్ టాక్ తో మొదలైన ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. తక్కువ బడ్జెట్ తో తారక్ రికార్డులను క్రియేట్ చేయడం గమనార్హం.