ఈ 5 తప్పుల వల్లే సుమంత్ స్టార్ హీరోగా ఎదగడం సాధ్యం కాలేదా?

అక్కినేని హీరో సుమంత్ కు రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు ఉంది. సుమంత్ ఏ పాత్రలో నటించినా ఆ పాత్రలో అద్భుతంగా నటించి ప్రశంసలు అందుకుంటారనే సంగతి తెలిసిందే. అయితే బ్యాగ్రౌండ్ ఉన్నా సుమంత్ కెరీర్ పరంగా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదని చాలామంది భావిస్తారు. సుమంత్ కెరీర్ లో కొన్ని హిట్ సినిమాలు ఉన్నా ఆ సినిమాలు సుమంత్ రేంజ్ కు తగిన హిట్లు కావని ఫ్యాన్స్ అభిప్రాయపడతారు.

నాగార్జున సపోర్ట్ చేసినా సుమంత్ మాత్రం కెరీర్ పరంగా సక్సెస్ కాలేదు. సుమంత్ రీమేక్ సినిమాలలో నటించినా ఆ సినిమాలు సైతం సక్సెస్ సాధించలేదు. సుమంత్ ఏపీ సీఎం వైఎస్ జగన్ కు స్నేహితుడు కావడం గమనార్హం. సినిమా రంగంపై ఆసక్తితో సినిమాల్లోకి వచ్చిన సుమంత్ ప్రేమకథ సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత యువకుడు సినిమాతో యావరేజ్ రిజల్ట్ సుమంత్ ఖాతాలో చేరింది.

అయితే సత్యం సినిమాతో సుమంత్ కు తొలి బిగ్గెస్ట్ హిట్ దక్కింది. గోదావరి సినిమా సక్సెస్ సాధించడంతో క్లాస్ ప్రేక్షకుల్లో సుమంత్ గుర్తింపు తెచ్చుకున్నారు. సుమంత్ నువ్వే కావాలి, దేశముదురు కథలను రిజెక్ట్ చేశారు. ఈ సినిమాలలో నటించి ఉంటే మాత్రం సుమంత్ కెరీర్ కచ్చితంగా పుంజుకుని ఉండేది. కొత్తదనంతో కూడిన కథల్లో నటించినా సుమంత్ కు ప్లస్ కాలేదు. తొలి సినిమా ఫ్లాప్ కావడం సుమంత్ కు మైనస్ అయింది.

కమర్షియల్ సినిమాలకు దూరంగా ఉండటం సుమంత్ కు ఒక విధంగా మైనస్ అయింది. స్టార్ హీరోలకు గట్టి పోటీ ఇవ్వకపోవడం సుమంత్ కు మైనస్ అయింది. అదృష్టం లేకపోవడం వల్ల కూడా సుమంత్ కెరీర్ విషయంలో సక్సెస్ కాలేకపోయారు. కథల జడ్జిమెంట్ విషయంలో సుమంత్ చేసిన పొరపాట్లు కూడా ఆయన కెరీర్ పై తీవ్రస్థాయిలోప్రభావం చూపాయి.