తెలుగులో బాగా పాపులర్ అయిన నటులలో సుమన్ ఒకరనే సంగతి తెలిసిందే. సుమన్ అసలు పేరు తల్వార్ సుమన్ గౌడ్ కాగా నీచల్ కులం మూవీతో సుమన్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. కరాటే నేర్చుకున్న సుమన్ కు అన్నమయ్య సినిమా కెరీర్ ను మలుపు తిప్పింది. హీరో సుమన్ తన పాత్రల ద్వారా ఎన్నో అవార్డ్ లను గెలుచుకున్నారు. అయితే హీరోగా బిజీగా ఉన్న సమయంలోనే సుమన్ ఒక కేసులో చిక్కుకున్నారు.
ఈ కేసు విషయంలో సుమన్ తప్పు ఉందో లేదో అనే ప్రశ్నకు చాలామందికి సమాధానం తెలియదు. సుమన్ వరుస విజయాలు సాధించడంతో దర్శకనిర్మాతలు ఆయన డేట్ల కోసం ఎదురుచూసే పరిస్థితి ఒకప్పుడు ఉండేది. అందంతో పాటు అద్భుతంగా నటించే నటుడు కావడం సుమన్ కు ప్లస్ అయింది. అయితే సుమన్ ఒక కేసులో చిక్కుకోవడం వల్ల ఆయన కెరీర్ ఒక విధంగా నాశనమైందని చెప్పవచ్చు.
ఒక ఇంటర్వ్యూలో సుమన్ మాట్లాడుతూ పోలీసులు తన ఇంట్లో సోదాలు చేసి పోలీసులు స్టేషన్ కు పిలిపించారని ఆయన తెలిపారు. ఆ తర్వాత తనపై ఆధారాలు లేకుండా నీలి చిత్రాల కేసు నమోదు చేశారని వారు చెప్పిన డేట్ లో నేను మరో ప్రాంతంలో ఉన్నానని సుమన్ తెలిపారు. ఆ సమయంలో తాను బెంగళూరులో షూట్ లో ఉన్నానని అయితే ఎఫ్.ఐ.ఆర్ ఫైల్ కావడంతో నాకు బెయిల్ దక్కలేదని ఆయన అన్నారు.
తనను టార్చర్ సెల్ లో ఉంచారని సుమన్ కామెంట్లు చేశారు. తర్వాత రోజు పేపర్ లో వేర్వేరు కథనాలు ప్రచారంలోకి వచ్చాయని ఆయన తెలిపారు. కరుణానిధికి తన పరిస్థితి గురించి తెలిసి జైలు సూపరిండెంట్ కు వార్నింగ్ ఇచ్చారని ఆయన తెలిపారు. ఐదు నెలల పాటు జైలులో ఉన్నానని ఆయన తెలిపారు. సినిమా ఇండస్ట్రీలో నన్ను ఎవరూ పట్టించుకోలేదని ఆయన వెల్లడించారు.