శ్రీహరి మరణం వెనుక ఉన్న అసలు నిజాలు తెలిస్తే షాకవ్వాల్సిందే?

ప్రముఖ టాలీవుడ్ నటులలో ఒకరైన శ్రీహరికి ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో క్రేజ్ ఉందనే సంగతి తెలిసిందే. కొన్నేళ్ల క్రితం శ్రీహరి మరణించగా శ్రీహరి మృతి టాలీవుడ్ ఇండస్ట్రీకి తీరని లోటు అనే సంగతి తెలిసిందే. టాలీవుడ్ ఇండస్ట్రీలో రియల్ హీరోగా శ్రీహరి ఊహించని స్థాయిలో పాపులారిటీని సొంతం చేసుకోవడం గమనార్హం. శ్రీహరి గారి మరణ వార్త ఆయన అభిమానులను ఎంతగానో బాధ పెట్టిందనే సంగతి తెలిసిందే.

అటు సీరియస్ రోల్స్ లో, ఇటు కామెడీ రోల్స్ లో తన నటనతో మెప్పించిన వ్యక్తి శ్రీహరి అనే సంగతి తెలిసిందే. తన సినీ కెరీర్ లో ఎన్నో విభిన్నమైన పాత్రలలో శ్రీహరి నటించారు. స్టంట్ మాస్టర్ గా సినిమాల్లోకి వచ్చిన శ్రీహరి అంచెలంచెలుగా ఎదిగారు. ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న శ్రీహరికి పోలీస్ పాత్రలు ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టాయి. అథ్లెట్ కావాలని అనుకున్న శ్రీహరి సినిమాలపై ఆసక్తితో ఆ కోరికను నెరవేర్చుకోలేదు.

పలు సినిమాలలో హీరోగా నటించి ఆ సినిమాలతో కూడా శ్రీహరి విజయాలను సొంతం చేసుకున్నారు. ఎలాంటి పాత్ర ఇచ్చినా ఆ పాత్రకు పూర్తిస్థాయిలో న్యాయం చేసే నటులలో శ్రీహరి ఒకరు. శ్రీహరికి డిస్కో శాంతితో వివాహం జరిగింది. కొన్ని సంవత్సరాల క్రితం కాలేయ సంబంధిత వ్యాధితో బాధ పడుతూ శ్రీహరి మృతి చెందారు. డిస్కో శాంతి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కడుపులో నొప్పి వస్తోందని శ్రీహరి చెప్పారని ఆమె తెలిపారు.

ముంబైలోని లీలావతి ఆస్పత్రికి శ్రీహరిని తీసుకెళ్లాలని నర్సు సెలైన్ బాటిల్ లో ఒక ఇంజక్షన్ చేయగా ఆ తర్వాత భర్త పరిస్థితి విషమంగా మారిందని ఆమె చెప్పుకొచ్చారు. శ్రీహరికి కడసారి మాట్లాడలేకపోయానని ఆమె తెలిపారు. బరువు తగ్గడానికి చేయించుకున్న చికిత్సల వల్ల శ్రీహరి చనిపోయారని సమాచారం. శ్రీహరి ఆస్తులను పెద్దగా కూడబెట్టుకోలేకపోయారని సమాచారం అందుతోంది.