విక్రమ్ అపరిచితుడు కథను మిస్ చేసుకున్న స్టార్ హీరో ఎవరో మీకు తెలుసా?

టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలలో సక్సెస్ రేట్ ఎక్కువగా డైరెక్టర్లలో శంకర్ ఒకరనే సంగతి తెలిసిందే. శంకర్ కెరీర్ లోని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్లలో అపరిచితుడు ఒకటి. విక్రమ్ సదా హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అంచనాలను మించి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాలోని కొన్ని సీన్లు ప్రేక్షకులకు ఎంతగానో కనెక్ట్ అయ్యాయి. తెలుగు ప్రేక్షకులను కూడా ఈ సినిమా ఆకట్టుకుందనే సంగతి తెలిసిందే.

అయితే ఈ సినిమా రజనీకాంత్ రిజెక్ట్ చేసిన కథ కావడం గమనార్హం. మన దేశంలోని పరిస్థితులను శంకర్ కళ్లకు కట్టినట్టుగా చూపించారు. వాస్తవానికి అపరిచితుడు కథ చాలా కొత్తగా ఉంటుంది. గతంలో తెలుగులో ఏ సినిమా తెరకెక్కని మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ ఆధారంగా శంకర్ ఈ సినిమాను తెరకెక్కించగా విక్రమ్ తన నటనతో ఈ సినిమాకు ప్రాణం పోశారనే చెప్పాలి.

ఒకే సినిమాలో మూడు పాత్రలలో కనిపించి విక్రమ్ మెప్పించడం గమనార్హం. సుజాత రంగనాథన్ ఈ సినిమాకు కథ అందించగా శంకర్ స్క్రీన్ ప్లే రాశారు. గరుడ పురాణం ఈ సినిమా కథలో కీలక పాత్ర పోషించింది. రజనీకాంత్ నో చెప్పడంతో శంకర్ విక్రమ్ ను కలిసి అపరిచితుడు సినిమాకు ఒప్పించారు. ఆస్కార్ వి రవిచంద్రన్ ఈ సినిమాను నిర్మించారు. ఐశ్వర్యారాయ్, సిమ్రాన్ ఈ సినిమాకు నో చెప్పడంతో సదాకు ఈ సినిమాలో ఛాన్స్ దక్కింది.

హరీష్ జైరాజ్ ఈ సినిమాకు సంగీతం అందించడం గమనార్హం. దాదాపుగా 27 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కింది. 2005 జూన్ 17వ తేదీన విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. రికార్డు స్థాయిలో ఈ సినిమా కలెక్షన్లను సాధించింది. ఈ సినిమా ఫ్రెంచ్ భాషలోకి డబ్ కావడం గమనార్హం. ఈ సినిమా ద్వారా ఈ సినిమాలో నటించిన నటీనటులకు, టెక్నీషియన్లకు ఎన్నో అవార్డులు వచ్చాయి.