ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు ఉంటాయి. సెలబ్రిటీల జీవితంలో ఎటువంటి కష్టాలు ఉండవని మనలో చాలామంది అనుకుంటారు. అయితే వాస్తవాలు మాత్రం భిన్నంగా ఉంటాయ్. ఆర్థిక కష్టాలు లేకపోయినా సినిమా రంగానికి చెందిన ప్రముఖులకు వేర్వేరు కష్టాలు ఉంటాయి. అయితే సీనియర్ ఎన్టీఆర్ కష్టాల్లో ఉన్న సమయంలొ రజినీకాంత్ మాత్రం ఆయనకు ఎలాంటి సహాయం చేయలేదు.
అటు సీనియర్ ఎన్టీఆర్ కు ఇటు రజనీకాంత్ కు దేశవ్యాప్తంగా క్రేజ్, గుర్తింపు, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందనే సంగతి తెలిసిందే. కొంతమంది ఫ్యాన్స్ రజనీకాంత్ కు వీరాభిమానులు కావడం గమనార్హం. తమిళంలో స్టార్ స్టేటస్ దక్కడంతో రజనీకాంత్ తమిళనాడుకే పరిమితమయ్యారు. రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తారని ఎన్నో వార్తలు ప్రచారంలోకి వచ్చాయనే సంగతి తెలిసిందే. రాజకీయాలపై రజనీకాంత్ ఆసక్తి చూపినా కొన్ని కారణాల వల్ల ఆయన వెనక్కు తగ్గారు.
సీనియర్ ఎన్టీఆర్ చంద్రబాబు చేతిలో మోసపోయిన సమయంలో రజనీకాంత్ సీనియర్ ఎన్టీఆర్ కు సపోర్ట్ గా నిలబడాలని అనుకున్నారు. ఆ తర్వాత ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల నుంచి, టీడీపీ నేతల నుంచి రజనీకాంత్ కు ఫోన్ కాల్స్ రాగా ఆ ఫోన్ కాల్స్ లో వాళ్లు ఏపీలో నెలకొన్న పరిస్థితుల గురించి వెల్లడించారు. లక్ష్మీపార్వతి గురించి చాలా విషయాలు తెలిసి అప్పట్లో రజనీకాంత్ ఆగిపోయారని సమాచారం.
ఒకవేళ రజనీకాంత్ సీనియర్ ఎన్టీఆర్ కు అండగా నిలిచి ఉంటే మాత్రం పరిస్థితులలో కచ్చితంగా మార్పు వచ్చి ఉండేది. సీనియర్ ఎన్టీఆర్ మరణం ఇప్పటికీ చాలామందిని బాధ పెడుతోంది. రాజకీయాల్లో ఎదురైన అవమానాల వల్లే ఆయనకు ఆరోగ్య సమస్యలు వచ్చాయని చాలామంది భావిస్తారు. సీనియర్ ఎన్టీఆర్ ను ఈతరం ప్రేక్షకుల్లో కూడా అభిమానించే ఫ్యాన్స్ ఎక్కువగా ఉన్నారు.