ఒక నటుడిలోని టాలెంట్ ను ఏ విధంగా వాడుకోవాలో తెలిసిన దర్శకుడు ఎవరనే ప్రశ్నకు రాజమౌళి పేరు సమాధానంగా వినిపిస్తుంది. సాధారణ సీన్స్ ను సైతం తన విజన్ తో అద్భుతంగా తెరకెక్కించే దర్శకునిగా జక్కన్నకు పేరుంది. ఎమోషన్స్ తో రాజమౌళి తెరకెక్కించే సినిమాలు బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాలను సొంతం చేసుకున్నాయి. ఎలివేషన్ సీన్లను సైతం అద్భుతంగా తెరకెక్కించే డైరెక్టర్లలో రాజమౌళి ఒకరు.
రామ్ చరణ్ రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కిన మగధీర సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించింది. అయితే ఒక ఇంటర్వ్యూలో రాజమౌళి మాట్లాడుతూ తాను చిరంజీవికి అభిమానినని కొదమ సింహం సినిమాను చూస్తున్న సమయంలో ఆ సినిమాలోని ఒక సీన్ లో రౌడీలు హీరోను పీకల్లోతు ఇసుకలో పాతిపెట్టి వెళ్లిపోవడం జరుగుతుందని అప్పుడు గుర్రం తాడును అందించడం ద్వారా కాపాడుతుందని ఆయన అన్నారు.
ఆ సన్నివేశం చూసి తాను ఎమోషనల్ అయ్యానని అయ్యానని అయితే హీరోకు గుర్రం పాత్రకు అనుబంధం ఉండేలా చూపించి ఉంటే బాగుండేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. మగధీరలో తనకు సాయం చేసిన గుర్రాన్ని కౌగిలించుకుని చరణ్ థ్యాంక్స్ చెబుతాడని చరణ్ ఆ సినిమాలో కృతజ్ఞతా భావంతో మాట్లాడతాడని ప్రేక్షకుల ఆలోచనల నుంచి స్పూర్తి పొందిన సన్నివేశాలు తన సినిమాలలో ఎక్కువగా ఉంటాయని జక్కన్న కామెంట్లు చేశారు.
ఆర్ఆర్ఆర్ సినిమాతో ఇండస్ట్రీ హిట్ సాధించిన రాజమౌళి ప్రస్తుతం కొత్త ప్రాజెక్ట్ పైనే దృష్టి పెట్టారు. మహేష్ సినిమాను వేగంగానే పూర్తి చేస్తానని రాజమౌళి చెబుతున్నా ఆయన అభిమానులు మాత్రం నమ్మడం లేదు. అయితే ఆలస్యంగా షూట్ చేసినా పరవాలేదని మహేష్ బాబుకు హిట్ ఇస్తే చాలని ఆయన ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. మహేష్ ఫ్యాన్స్ కోరికను రాజమౌళి ఏ రేంజ్ లో నెరవేరుస్తారో చూడాలి.