ఆ సీన్ లో ప్రభాస్ బాగా చేయలేదని జక్కన్న ఫీలయ్యారా.. ఏం జరిగిందంటే?

స్టార్ డైరెక్టర్ రాజమౌళి స్టార్ హీరో ప్రభాస్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఛత్రపతి సినిమా బాక్సాఫీస్ వద్ద సృష్టించిన సంచలనాలు అన్నీఇన్నీ కావు. శ్రియ ఈ సినిమాలో హీరోయిన్ రోల్ లో నటించగా భానుప్రియ ఈ సినిమాలో మరో కీలక పాత్రలో నటించి మెప్పించారు. అయితే రాజమౌళి దర్శకత్వం వహించిన స్టూడెంట్ నంబర్ 1 సినిమాను చూసి మొదట ప్రభాస్ రాజమౌళి డైరెక్షన్ లో నటించకూడదని అనుకున్నారు.

అయితే సింహాద్రి సినిమా విడుదలై బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని సొంతం చేసుకోవడంతో ప్రభాస్ నిర్ణయం మారిపోయింది. బీ.వీ.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మాతగా రాజమౌళి డైరెక్షన్ లో ప్రభాస్ హీరోగా ఛత్రపతి సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో జక్కన్న ప్రభాస్ ను చూపించిన విధానం ప్రేక్షకులను సైతం ఆశ్చర్యానికి గురి చేసింది. ప్రభాస్ రాజమౌళి మధ్య మంచి అనుబంధం ఉంది. రాజమౌళి తెచ్చిన ఛత్రపతి కథ ప్రభాస్ కు ఎంతగానో నచ్చింది.

ప్రభాస్ కు ఎలాంటి కథ నప్పుతుందో అని రాజమౌళి చాలా ఆలోచించి ఎమోషన్స్ తో ఉన్న సినిమాను తెరకెక్కించారు. తల్లీకొడుకుల సెంటిమెంట్ తో ఉన్న కథ కావాలని రాజమౌళి కోరగా అన్ని ఎమోషన్స్ తో ఉన్న ఛత్రపతి కథ సిద్ధమైంది. ఈ సినిమాలోని అపరిచితుడు పేరడీ సీన్లు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. రాజమౌళి భానుప్రియను రిక్వెస్ట్ చేసి ఈ సినిమాకు ఒప్పించారు.

ఈ సినిమాలోని మెజారిటీ సన్నివేశాల షూట్ వైజాగ్ లో జరిగింది. హాలీవుడ్ టెక్నిక్స్ ను ఈ సినిమా కోసం వినియోగించారు. 12.5 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కింది. సినిమాలో ప్రభాస్ ఇంట్రడక్షన్ షాట్ అనుకున్న విధంగా రాకపోవడంతో జక్కన్న ఫీలయ్యారు. చిరంజీవి ఈ సినిమాను చూసి జక్కన్నను ప్రశంసించారు. ఈ సినిమా భారీ స్థాయిలో హిట్టై నిర్మాతలకు మంచి లాభాలను అందించింది.