పవన్, మహేష్ బాబు సినిమాల వల్ల ఇండస్ట్రీకి దూరమైన నిర్మాత ఎవరో తెలుసా?

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఏ నిర్మాత అయినా బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలను నిర్మించాలని వస్తారు. అయితే కొంతమంది నిర్మాతలు తమ దగ్గర డబ్బు ఉన్నా సరైన కథను ఎంచుకునే విషయం తడబడతారు. అలా పవన్ కళ్యాణ్, మహేష్ బాబు లాంటి స్టార్ హీరోలతో సినిమాలను తెరకెక్కించి ఇండస్ట్రీకి దూరమైన నిర్మాతగా శింగనమల రమేష్ బాబుకు పేరుంది. ఈయన పవన్ కళ్యాణ్ తో కొమరం పులి, మహేష్ తో ఖలేజా సినిమాలను నిర్మించారు.

ఈ రెండు సినిమాలు కమర్షియల్ గా ఫ్లాప్ అయ్యాయి. ఈ సినిమాల కోసం భారీ మొత్తం అప్పులు చేసిన నిర్మాత రమేష్ బాబుకు చివరకు నష్టాలే మిగిలాయి. ఆ తర్వాత పలు వివాదాల్లో చిక్కుకున్న రమేష్ బాబు చివరకు ఇండస్ట్రీకి దూరం కావాల్సి వచ్చింది. ఒకవేళ ఈ రెండు సినిమాలు సక్సెస్ సాధించి ఉంటే మాత్రం శింగనమల రమేష్ బాబు టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ ప్రొడ్యూసర్ గా ఒక వెలుగు వెలిగేవారు.

పవన్ కళ్యాణ్, మహేష్ బాబు సినిమాల వల్ల ఎంతోమంది నిర్మాతలు ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ నిర్మాతలుగా కొనసాగుతున్నారు. కొమరం పులి సినిమాకు ఎస్.జె.సూర్య దర్శకత్వం వహించగా ఖలేజా సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించారు. ఈ రెండు సినిమాలు ఎక్కువరోజులు షూటింగ్ జరుపుకోవడం వల్ల కూడా ఈ సినిమాలపై బడ్జెట్ భారం మరింత పెరిగింది.

దాదాపు 80 కోట్ల రూపాయల బడ్జెట్లతో ఈ రెండు సినిమాలు తెరకెక్కగా ఈ రెండు సినిమాలు ఫుల్ రన్ లో సాధించిన కలెక్షన్లు కేవలం 30 కోట్ల రూపాయలు మాత్రమే కావడం గమనార్హం. ప్రొద్దుటూరులోని ప్రముఖ ఫైనాన్షియర్ల నుంచి అప్పులు తీసుకుని శింగనమల రమేష్ ఈ సినిమాలను నిర్మించారు. అయితే తాను అప్పుగా తీసుకున్న డబ్బును ఫైనాన్షియర్లకు తిరిగి చెల్లించడంలో ఈ నిర్మాత విఫలమయ్యారు.