భార్యకు ఇచ్చిన మాట కోసం అవమానాలను భరించిన ఎన్టీఆర్.. ఏమైందంటే?

సీనియర్ ఎన్టీఆర్ తన సినీ కెరీర్ లో సొంతం చేసుకున్న విజయాలు అన్నీఇన్నీ కావు. రాజకీయ రంగంలోనూ, సినిమాల్లోనూ తనదైన ముద్ర వేసిన నటులలో సీనియర్ ఎన్టీఆర్ ఒకరు. సీనియర్ ఎన్టీఆర్ తో భార్య బసవతారకం మీరు రాజకీయాల్లోకి రావాలని రాజకీయాల్లోకి వచ్చి ప్రజల కోసం మంచి పనులు చేయాలని మాటివ్వాలని కోరగా ఎన్టీఆర్ మాట ఇవ్వడంతో పాటు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.

రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత సీనియర్ ఎన్టీఆర్ ప్రజలకు ప్రయోజనం చేకూరేలా ఎన్నో పథకాలను అమల్లోకి తెచ్చారు. ప్రజలకు న్యాయం చేయడం కోసమే సీనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చారు. 1982 సంవత్సరంలో సీనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. తెలుగు ప్రజల కోసం ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారు. ప్రజల హృదయాల్లో రాజకీయ నేతగా కూడా ఎన్టీఆర్ మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.

కాంగ్రెస్ పార్టీపై ఆయన తీవ్రస్థాయిలో విమర్శలు చేయడం గమనార్హం. ఎన్నికలకు తొమ్మిది నెలల క్రితం పార్టీ పెట్టి రాజకీయాల్లో సంచలనాలు సృష్టించారు. ఎన్నో వివాదస్పద నిర్ణయాలు తీసుకున్న ఎన్టీఆర్ కొన్నిసార్లు విమర్శలను ఎదుర్కోవాల్సి వచ్చింది. సీనియర్ ఎన్టీఆర్ పాలన ఏకస్వామ్య పాలన అని కొన్నిసర్లు విమర్శలు వ్యక్తమయ్యాయి. ఆ విమర్శల వల్ల 1989లో ఎన్టీఆర్ పార్టీ అధికారంలోకి రాలేదు.

సీనియర్ ఎన్టీఆర్ లక్ష్మీపార్వతిని వివాహం చేసుకోవడం వల్ల కుటుంబంలో విభేదాలు వ్యక్తమయ్యాయి. లక్ష్మీపార్వతి జోక్యం వల్ల తెలుగుదేశం నేతల నుంచి అసంతృప్తి వ్యక్తమైంది. సీనియర్ ఎన్టీఆర్ ప్రజల హృదయంలో నిలిచిపోయారనే చెప్పాలి. సీనియర్ ఎన్టీఆర్ ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో పలు సినిమాలలో నటించగా ఆ సినిమాలు కూడా కమర్షియల్ గా సక్సెస్ ను సొంతం చేసుకున్నాయి.