9 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కి 50 కోట్ల షేర్ సాధించిన నాగార్జున మూవీ ఏదో తెలుసా?

యంగ్ జనరేషన్ స్టార్ హీరోలతో పోల్చి చూస్తే నాగార్జున మార్కెట్ తక్కువేననే సంగతి తెలిసిందే. అయితే బ్లాక్ బస్టర్ టాక్ వస్తే బాక్సాఫీస్ వద్ద నాగార్జున సంచలన విజయాలను సొంతం చేసుకున్న సందర్భాలు ఎక్కువగానే ఉన్నాయి. అలా నాగార్జున సక్సెస్ ను సొంతం చేసుకున్న సినిమాలలో సోగ్గాడే చిన్నినాయన కూడా ఒకటి. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా కళ్లు చెదిరే స్థాయిలో కలెక్షన్లను సాధించింది.

ఫ్యామిలీ ప్రేక్షకులను ఈ సినిమా ఎంతగానో ఆకట్టుకుంది. 2016 సంవత్సరం సంక్రాంతి పండుగ కానుకగా నాన్నకు ప్రేమతో, డిక్టేటర్, సోగ్గాడే చిన్నినాయన సినిమాలు విడుదలయ్యాయి. ఈ మూడు సినిమాలకు పాజిటివ్ టాక్ వచ్చినా నాన్నకు ప్రేమతో సినిమా మాస్ ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. డిక్టేటర్ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ఈ సినిమా ఫెయిలైంది.

సోగ్గాడే చిన్నినాయన మాత్రం ఫ్యామిలీ ప్రేక్షకులను ఆకట్టుకుని విన్నర్ గా నిలిచింది. 9 కోట్ల రూపాయల పరిమిత బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా దర్శకుడు కళ్యాణ్ కృష్ణకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఈ సినిమా సక్సెస్ తో కళ్యాణ్ కృష్ణకు కూడా సినిమా ఆఫర్లు పెరిగాయి. ఒక విధంగా నాగార్జున 2016 సంవత్సరంలో నందమూరి హీరోలపై పైచేయి సాధించారు. పరిమిత సంఖ్యలో థియేటర్లలో రిలీజ్ కావడం ఈ సినిమాకు ప్లస్ అయింది.

బాక్సాఫీస్ వద్ద కళ్లు చెదిరే స్థాయిలో ఈ సినిమా కలెక్షన్లను సొంతం చేసుకుంది. ఈ ఏడాది సోగ్గాడే చిన్నినాయన సీక్వెల్ గా తెరకెక్కిన బంగార్రాజు సినిమాతో నాగార్జున మరో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నారు. ఈ తరహా పాత్రలు నాగార్జునకు మినహా మరే హీరోకు సూట్ కావని ఫ్యాన్స్ సైతం ఓపెన్ గా చెబుతున్నారు. నాగార్జున కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. సంక్రాంతి పండుగకు ఎక్స్ ప్రెస్ రాజా సినిమా విడుదల కాగా ఆ సినిమా కూడా సక్సెస్ సాధించింది.