మెగా బ్రదర్ నాగబాబుకు ప్రేక్షకులలో ప్రత్యేక గుర్తింపు ఉందనే సంగతి తెలిసిందే. నాగబాబు పలు సినిమాలలో నటించడంతో పాటు పలు సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరించారు. నాగబాబు పద్మజల వివాహం 1988 సంవత్సరం ఆగష్టు 26వ తేదీన జరిగింది. నాగబాబు పద్మజల వివాహానికి సంబంధించి చాలా విషయాలు అభిమానులకు పెద్దగా తెలియదు. నాగబాబు తల్లి ఒక పెళ్లి వేడుకలో పద్మజను చూశారు.
పద్మజ అందంగా కనిపించడంతో పద్మజ కజిన్ ఇంటికి వెళ్లిన అంజనాదేవికి అక్కడ పద్మజకు చిరంజీవి అంటే ఎంతో అభిమానమని తేలింది. నాగబాబుకు 29 సంవత్సరాల వయస్సు ఉన్న సమయంలో పెళ్లి జరిగింది. మధ్యతరగతి అమ్మాయి కావాలని నాగబాబు కోరుకోగా నాగబాబు కోరుకున్న అమ్మాయి దొరికింది. అంజనా దేవి పద్మజ గురించి చెప్పడంతో నాగబాబు పద్మజల పెళ్లి దిశగా అడుగులు పడ్డాయి.
పద్మజ కుటుంబ సభ్యులు మొదట నాగబాబుతో పెళ్లి వద్దని వ్యక్తిగత కారణాల వల్ల అనుకున్నారు. నిశ్చితార్థం తర్వాత ఫోన్ లో పలు సందర్భాల్లో నాగబాబు పద్మజ మాట్లాడుకున్నారని సమాచారం. చిరంజీవి ఇంట్లోనే నాగబాబు ఉండేవారు కాబట్టి చిరంజీవి అంటే నాగబాబు మరింత ఎక్కువగా అభిమానం ఉండేది. 1990లో వరుణ్ తేజ్ జన్మించగా ఆ తర్వాత నాగబాబు చిరంజీవి కుటుంబంతో కాకుండా వేరు కాపురం పెట్టారు.
చిరంజీవి గారి ఇంటికి సమీపంలోనే నాగబాబు మరో ఇంటిని తీసుకున్నారు. ఆ తర్వాత నిహారిక జన్మించారు. నిహారిక పలు సినిమాలలో, వెబ్ సిరీస్ లలో నటించి మంచి గుర్తింపును సంపాడించుకున్నారు. పెళ్లి తర్వాత నిహారిక సినిమాలకు దూరంగా ఉన్నారు. నిహారికకు సోషల్ మీడియాలో క్రేజ్ ఎక్కువగా ఉంది. పెళ్లి తర్వాత అన్యోన్యంగా ఉన్న జోడీలలో నాగబాబు పద్మజల జోడీ ఒకటి కావడం గమనార్హం.