చిరంజీవి సినిమాకు పని చేయడం వల్లే ఈ రైటర్ కెరీర్ నాశనమైందా?

మెగాస్టార్ చిరంజీవి సినీ కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లు ఉన్నాయి. ఎంతోమంది రచయితలు, డైరెక్టర్లు చిరంజీవి సినిమాల ద్వారా గుర్తింపును సంపాదించి ఉన్నత స్థానాలను చేరుకున్నారు. అయితే చిరంజీవి సినిమాకు పని చేయడం వల్లే ఎల్బీ శ్రీరామ్ కెరీర్ నాశనమైంది. వినడానికి ఆశ్చర్యం కలిగించినా ఇది నిజం అని చెప్పవచ్చు. తన కామెడీ టైమింగ్ తో ఎన్నో సినిమాల సక్సెస్ లో ఎల్బీ శ్రీరామ్ కీలక పాత్ర పోషించారు.

చిన్న సినిమాలతో పాటు పెద్ద సినిమాలలో కూడా ఎల్బీ శ్రీరామ్ నటించారు. ఎల్బీ శ్రీరామ్ నటుడిగానే సుపరిచితమైనా ఆయనలో గొప్ప రచయిత కూడా ఉన్నారు. ఎల్బీ శ్రీరామ్ ఆల్ ఇండియా రేడియోలో పని చేయడంతో పాటు రంగస్థల నటుడిగా గుర్తింపును సంపాదించుకున్నారు. ఎల్బీ శ్రీరామ్ రచించిన రచనలలో చాలా రచనలు పాపులర్ అయ్యాయి. కిష్కింధ కాండ సినిమాకు రచయితగా ఆయన పనిచేశారు.

ఇ.వి.వి. సత్యనారాయణ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమాలు ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. 400కు పైగా సినిమాలలో ఎల్బీ శ్రీరామ్ నటించగా పలు సినిమాలలకు ఎల్బీ శ్రీరామ్ కు అవార్డులు వచ్చాయి. మెగాస్టార్ చిరంజీవి హిట్లర్ సినిమా ఒక విధంగా ఎల్బీ శ్రీరామ్ కెరీర్ నాశనమైందని సమాచారం. ఒక సందర్భంలో ఎల్బీ శ్రీరామ్ మాట్లాడుతూ ఈ విషయాలను వెల్లడించారు. హిట్లర్ తర్వాత రైటర్ గా చాలా సినిమాలు వస్తాయని అనుకున్నానని ఆయన అన్నారు.

అయితే హిట్లర్ సినిమాతో రైటర్ గా ఆయనకు ఆశించిన స్థాయిలో గుర్తింపు రాకపోవడంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎల్బీ శ్రీరామ్ కెరీర్ ను కొనసాగిస్తున్నారు. హిట్లర్ సినిమాలో చిరంజీవికి ఎక్కువ డైలాగ్స్ ఉండి ఉంటే మాత్రం రైటర్ గా ఎల్బీ శ్రీరామ్ రేంజ్ మరోలా ఉండేది. మిథునం సినిమాలో మొదట ఎల్బీ శ్రీరామ్ కు ఛాన్స్ వచ్చినా కొన్ని కారణాల వల్ల ఆయనకు ఛాన్స్ మిస్ అయిందని తెలుస్తోంది.