జూనియర్ ఎన్టీఆర్ సినీ కెరీర్ అయిపోయిందని కామెంట్లు.. ఆ జర్నలిస్ట్ ఏం చెప్పారంటే?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సినీ కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లు ఉన్నాయి. అయితే సింహాద్రి తర్వాత కెరీర్ విషయంలో తారక్ ఒడిదొడుకులను ఎదుర్కొన్నారు. జర్నలిస్ట్ ప్రభు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సింహాద్రి తర్వాత జూనియర్ ఎన్టీఆర్ నటించిన చాలా సినిమాలు ఆడలేదని అన్నారు. నరసింహుడు సినిమా ప్రేక్షకులను బాగా నిరాశకు గురి చేసిందని ఆయన చెప్పుకొచ్చారు.

రాఖీ సినిమా బాగా ఆడిందని అయితే ఆ సినిమాలో ఎన్టీఆర్ బొద్దుగా కనిపించడం మైనస్ అయిందని ఆయన వెల్లడించారు. ఆ సమయంలో జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ అయిపోయిందని కామెంట్లు వ్యక్తమయ్యాయని జర్నలిస్ట్ ప్రభు చెప్పుకొచ్చారు. రాఖీ సినిమా ఎన్టీఆర్ అభినయం వల్ల హిట్ అయిందని ఆయన తెలిపారు. మేకోవర్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే మొదట జూనియర్ ఎన్టీఆర్ ను చూసి నేర్చుకోవాలని ఆయన చెప్పుకొచ్చారు.

యమదొంగలో స్లిమ్ అయినా ఎన్టీఆర్ ఫేస్ లో వీక్ నెస్ కనిపించిందని ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ ఫేస్ లో కళ ఉందని జర్నలిస్ట్ ప్రభు చెప్పుకొచ్చారు. అదుర్స్ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ అద్భుతమైన వేరియేషన్స్ చూపించారని ఆయన తెలిపారు. క్లబ్ సీన్ లో తారక్ అద్భుతంగా చేశారని ఆయన తెలిపారు. సినిమాసినిమాకు జూనియర్ ఎన్టీఆర్ నటనలో ఎంతో పరిణతి చూపించారని జర్నలిస్ట్ ప్రభు పేర్కొన్నారు.

ఇండియాలోనే ఫైనెస్ట్ యాక్టర్స్ లో అతను ఒకరని జర్నలిస్ట్ ప్రభు చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ ప్రస్తుతం సినిమాసినిమాకు పాత్రకు అనుగుణంగా లుక్ ను మార్చుకుంటున్నారు. తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా ఎన్టీఆర్ విజయాలను అందుకోవడం గ్యారంటీ అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఎన్టీఆర్ తర్వాత ప్రాజెక్ట్ లతో బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాలను అందుకుంటారో చూడాల్సి ఉంది. ఒక్కో సినిమాకు 50 కోట్ల రూపాయలకు పైగా తారక్ రెమ్యునరేషన్ ను అందుకుంటున్నారు