జూనియర్ ఎన్టీఆర్ మందు తాగి యాక్సిడెంట్ చేశారా.. వాస్తవం ఏమిటంటే?

సినిమా రంగానికి చెందిన సెలబ్రిటీల గురించి ఎన్నో ఫేక్ వార్తలు జోరుగా ప్రచారంలోకి వస్తుంటాయి. ఆ వార్తలు చాలా సందర్భాల్లో అభిమానులను సైతం ఎంతగానో బాధపెడతాయి. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ 20 సంవత్సరాల వయస్సులోనే బ్లాక్ బస్టర్ హిట్లను సొంతం చేసుకున్న టాలీవుడ్ హీరోలలో ఒకరనే సంగతి తెలిసిందే. తారక్ నటనకు సినీ ప్రముఖుల నుంచి ఊహించని స్థాయిలో ప్రశంసలు దక్కాయి.

అయితే 2009 ఎన్నికల సమయంలో జూనియర్ ఎన్టీఆర్ కు యాక్సిడెంట్ జరిగింది. ఆ సమయంలో తారక్ డ్రైవింగ్ చేయగా తారక్ ముఖంపై గాయాలయ్యాయి. జూనియర్ ఎన్టీఆర్ ప్రాణాలకు మాత్రం ఎలాంటి అపాయం కలగలేదు. ఆ సమయంలో జూనియర్ ఎన్టీఆర్ మందు తాగి యాక్సిడెంట్ చేశారని ఎన్నో వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. వైరల్ అయిన వార్తలను చాలామంది నిజమేనని నమ్మారు.

అయితే ఒక ఇంటర్వ్యూలో తారక్ కు ఇదే ప్రశ్న ఎదురు కాగా తాను మందు తాగి డ్రైవింగ్ చేయలేదని తెలిపారు. నేను మందు తాగి ఉంటే వైద్యులు అనస్థీషియా ఇవ్వాల్సిన అవసరం ఏముండేదని ఆయన ప్రశ్నించారు. స్వయంగా జూనియర్ ఎన్టీఆర్ క్లారిటీ ఇవ్వడంతో ఆరోజు ఎన్టీఆర్ మందు తాగలేదని ఫ్యాన్స్ కు సైతం క్లారిటీ వచ్చేసింది. ఆర్ఆర్ఆర్ సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ను అందుకున్నారనే సంగతి తెలిసిందే.

ఎన్టీఆర్ తర్వాత సినిమాలు సైతం సక్సెస్ ను సొంతం చేసుకోవాలని బాక్సాఫీస్ వద్ద రికార్డులను సృష్టించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. వరుస విజయాలతో ఎన్టీఆర్ రేంజ్ మరింత పెరగడం గ్యారంటీ అని ఇండస్ట్రీలో వినిపిస్తోంది. తాతకు తగ్గ మనవడిగా ఎన్టీఆర్ ఎన్నో విజయాలను సొంతం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. సినిమాసినిమాకు తారక్ రేంజ్ అంతకంతకూ పెరుగుతోంది.