సినిమా ఇండస్ట్రీలో గునుపూడి విశ్వనాథ శాస్త్రిగా ఐరన్ లెగ్ శాస్త్రి తనకంటూ ప్రత్యేక పేరు, గుర్తింపును సొంతం చేసుకున్నారు. ఐరన్ లెగ్ శాస్త్రి తన పాత్రల ద్వారా ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకోవడంతో పాటు క్రేజ్ ను అంతకంతకూ పెంచుకున్నారు. ఐరన్ లెగ్ శాస్త్రి 150కు పైగా సినిమాలలో నటించగా పలు సినిమాలలో ఐరన్ లెగ్ శాస్త్రి పురోహితుని పాత్రలలో నటించడం గమనార్హం.
ఐరన్ లెగ్ శాస్త్రి ఇండస్ట్రీకి రావడం వెనుక ఆశ్చర్యకరమైన స్టోరీ ఉంది. ఇ.వి.వి.సత్యనారాయణ ఒక పెళ్లికి హాజరైన సమయంలో ఐరన్ లెగ్ శాస్త్రిలోని కామెడీ టైమింగ్ ను గుర్తించి సినిమా ఛాన్స్ ఇచ్చారు. అప్పుల అప్పారావు సినిమాతో నటుడిగా ఐరన్ లెగ్ శాస్త్రి కెరీర్ మొదలైంది. ఆ తర్వాత వరుసగా సినిమాలలో నటించిన ఐరన్ లెగ్ శాస్త్రి పలు అవార్డులను సైతం గెలుచుకున్నారు.
2006 సంవత్సరం జూన్ నెల 19వ తేదీన ఆయన చనిపోయారు. ఐరన్ లెగ్ శాస్త్రి చనిపోయిన సమయంలో ఆయన కుటుంబం ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతుండగా ఆయన కుటుంబ సభ్యులు ప్రభుత్వాన్ని ఆదుకోవాలని కోరారు. ఐరన్ లెగ్ శాస్త్రి కొడుకు ప్రసాద్ ఎంబీఏ వరకు చదివారు. ప్రస్తుతం ప్రసాద్ పలు సినిమాలలో నటిస్తుండగా ఆ సినిమాలలో నటనకు మంచి మార్కులు పడ్డాయి.
బ్రహ్మానందం, ఐరన్ లెగ్ శాస్త్రి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాలను సొంతం చేసుకున్నాయి. అయితే తర్వాత రోజుల్లో ఆయన నటించిన కొన్ని సినిమాలు ఫ్లాప్ రిజల్ట్ ను అందుకోగా ఆయన వల్లే ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫ్లాపులుగా నిలిచాయని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. కొత్త దర్శకులు ఐరన్ లెగ్ శాస్త్రికి ఎక్కువగా ఆఫర్లు ఇవ్వకపోవడం కూడా ఆయన కెరీర్ పై తీవ్రస్థాయిలో ప్రభావం చూపింది.