ఈ స్టార్ హీరోల సినిమాలు నిజంగా ఇండస్ట్రీ హిట్లు కాదా.. ఫేక్ అంటూ?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలు ఇండస్ట్రీ హిట్లుగా నిలిచాయి. ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద కళ్లు చెదిరే కలెక్షన్లను సాధించడంతో పాటు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అయితే కొన్ని సినిమాలు ఇండస్ట్రీ హిట్లు అయినా వివాదాస్పదం కావడం గమనార్హం. ఈ సినిమాలు ఇండస్ట్రీ హిట్లు అని కొంతమంది భావిస్తే మరి కొందరు మాత్రం ఈ సినిమాలు ఇండస్ట్రీ హిట్లు కావని చెబుతున్నారు.

ఈ సినిమాలు ఇండస్ట్రీ హిట్లు అవునో కాదో అర్థం కక అభిమానులు సైతం ఒకింత కన్ఫ్యూజ్ అవుతున్నారు. సోషల్ మీడియాలో కూడా ఇండస్ట్రీ హిట్లుగా ప్రచారం జరుగుతున్న కొన్ని సినిమాల గురించి జోరుగా చర్చ జరుగుతోంది. ఫ్యాన్స్ యాంటీ ఫ్యాన్స్ మధ్య కొన్ని సినిమాల విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చిరంజీవి సినీ కెరీర్ లోని ఇండస్ట్రీ హిట్లలో ఖైదీ సినిమా ఒకటనే సంగతి తెలిసిందే.

ప్రేమాభిషేకం, కొండవీటి సింహం, ముందడుగు సినిమాలు ఖైదీ కంటే ఎక్కువ మొత్తం కలెక్షన్లను సాధించాయని ఇండస్ట్రీలో వార్తలు ప్రచారంలో ఉన్నాయి. నాగ్ నటించిన నిన్నే పెళ్లాడతా సినిమా పెదరాయుడు సినిమా కలెక్షన్లను క్రాస్ చేయలేదని అందువల్ల ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ కాదని చాలామంది భావిస్తారు. కలిసుందాంరా ఇండస్ట్రీ హిట్ అయినా సమరసింహారెడ్డి కలెక్షన్లను ఈ సినిమా క్రాస్ చేయలేదని చాలామంది భావిస్తారు.

2001లో విడుదలై సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న ఖుషి నరసింహనాయుడు కలెక్షన్లను క్రాస్ చేయలేదని చాలామంది చెబుతారు. ఎన్టీఆర్ కెరీర్ లోని బిగ్గెస్ట్ హిట్లలో సింహాద్రి ఒకటి కాగా ఈ సినిమా ఇంద్ర కలెక్షన్లను క్రాస్ చేయలేదని కొంతమంది చెబుతారు. దూకుడు సినిమా మగధీర కలెక్షన్లను క్రాస్ చేయలేదని కొంతమంది భావిస్తారు.